విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా ఫౌండేషన్ సభ్యులు ఎన్డీయే కూటమి నాయకుల సహకారంతో భారీ వర్షంలోనూ శనివారం తమ సేవలను అందించారు.గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ లోని రాజా రాజేశ్వరి పేట, ఊర్మిళ నగర్, ప్రియదర్శిని కాలనీ, ఇందిరాగాంధీ కాలనీ, హెచ్ బి కాలనీలతోపాటు అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. ఇళ్లలోని ఫర్నిచర్ ఇతర సామాగ్రి తడచి వంట చేసుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సుజనా ఆదేశాలతో అనేక వందల మందికి భోజన ప్యాకెట్లను శనివారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా ఫౌండేషన్ సభ్యులు, భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి ధైర్యం చెప్పారు. గత వైసిపి పాలకులు అవుట్ ఫాల్ డ్రెన్లను ఆధునీకరించకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే సుజనా త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి నూతన డ్రైయిన్ల నిర్మాణానికి శ్రీకారం చుడతారన్నారు. పశ్చిమ ప్రజలకు ఎల్లవేళలా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది అండగా ఉంటామని హామీ ఇచ్చారు.జోరు వానలోనూ భోజన ప్యాకెట్లను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సుజనాకు పశ్చిమ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా ఫౌండేషన్ సభ్యులు, వీరమాచనేని కిరణ్, చింతా బాబి, మంతెన తరుణ్, నాయకులు బోగవల్లి శ్రీధర్, బి ఎస్ కే పట్నాయక్, అవ్వారు బుల్లబ్బాయి, దొడ్ల రాజా, ప్రదీప్, ఉమాకాంత్, పచ్చిపులుసు ప్రసాద్ , మహేష్, ఎన్డీయే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …