విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో గత 24 గంటలుగా ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మొగల్రాజపురం ఏరియాలో కొండచర్యలు విరిగి పడినట్లు సమాచారం అందిన వెంటనే పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. సంఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎన్. డి. ఆర్. ఎఫ్ ; ఎస్. డి. ఆర్. ఎఫ్, పోలీసులు, రెవిన్యూ మరియు మున్సిపల్ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి శిధిలాలను తొలగించి, మృతదేహాలను వెలికితీసి, క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందెలా చూడాలని వైద్యులతో మాట్లాడారు. విరిగిపడిన కొండ చర్యలను క్లియర్ చేసి, కొండ చర్యలు పడే ప్రమాదం ఉన్న ఇళ్లను ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. కొండ చర్యలు పడే ఆస్కారం ఉన్న ప్రదేశాలో పోలీస్ సిబ్బందిని నియమించి ఆ ప్రదేశం లోనికి ఎవ్వరూ రాకుండా చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన కొండ రాళ్లు జారిపడే అవకాశం ఉన్నందున కొండప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ సురక్షిత ప్రాంతాలలో ఉండాలని పోలీస్ కమిషనర్ గారు ప్రజలను కోరారు.
Tags vijayawada
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …