మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్ధరాత్రి 12.30 మరియు 0230 గం మధ్య ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటిన వాయుగుండం. ఇవాళ చాలా చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు. వైయస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కృష్ణా నది వరద ఉధృతి. ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 5,55,250 క్యూసెక్కలు. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి. పడిపోయిన విద్యుత్ లైన్లకు,స్తంభాలకు దూరంగా ఉండాలి. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకండని విపత్తుల నిర్వహణ సంస్థ, మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Tags machilipatnam
Check Also
ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం ‘సంక్రాంతి’ …