మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.03.09.2024 మంగళవారం నాడు “అవనిగడ్డ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల” నందు నిర్వహించబోయే “జాబ్ మేళాను”, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరియు నెలకొని ఉన్న వరదల కారణంగా అవనిగడ్డ లో నిర్వహించబోయే జాబ్ మేళాను వాయిదా వేస్తున్నట్లుగా డి.విక్టర్ బాబు, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు ఎస్.శ్రీనివాసరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంయుక్తంగా తెలియజేసారు. తదుపరి తేదీను పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తామని సంయుక్తంగా తెలిపారు. ఈ విషయాన్ని నిరుద్యోగ యువత గమనించవలసినదిగా కోరారు.
Tags machilipatnam
Check Also
ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం ‘సంక్రాంతి’ …