-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు నిలిచిన లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించడానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం బిఆర్ స్టేడియం, శ్రామిక నగర్, ముగ్డుం నగర్, బాలాజీ నగర్ మొండి గేటు తదితర ప్రాంతాల్లో పర్యటించి, ఆయా ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిందని, ఆయా ప్రాంతాల్లో ఇంజినీరింగ్ అధికారులు నీటిని తొలగించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం సదరు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. బాలాజీ నగర్ దగ్గరలోని మొండి గేటుని పరిశీలించి, సదరు ప్రాంతం నగరంలోని అధిక శాతం డ్రైన్ల ద్వారా వచ్చే నీరు వెళ్లే మార్గమని, అక్కడ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. బిఆర్ స్టేడియంలో నిలిచిన నీటిని పరిశీలించి, స్టేడియం వెలుపల ప్రతిపాదనలో ఉన్న డ్రైన్ నిర్మాణ పనులను చేపట్టాలని ఏఈని ఆదేశించారు. స్టేడియం అధికారులతో సమన్వయం చేసుకొని స్టేడియం లోపల డ్రైన్, వెలుపల వైపు ప్రతిపాదించిన డ్రైన్ లెవల్స్ సరి చూసుకోవాలన్నారు. శ్రామిక నగర్ లో ఇళ్లల్లోకి వర్షం నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలుపగా, పరిశీలించి వెంటనే కచ్చా కాల్వ చేసి నీటిని తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే డ్రైన్ల మార్గాల్లో అడ్డుగా నిర్మాణాలు చేసుకోకూడదని ప్రజలకు సూచించారు.
పర్యటనలో ఎస్ఈ శ్యాం సుందర్, ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ శ్రీధర్, ఏఈ సునీల్ కుమార్, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, కార్పొరేటర్లు మహమూద్, మీరావలి, చిస్టి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.