గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు వలన గుంటూరు నగరపాలక సంస్థ తూర్పునియోజకవర్గం పరిధిలో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలను ఆదివారం కేంద్ర గ్రామీణభివృద్ధి , కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్ అహ్మద్ తో కలసి పరిశీలించారు. పాతగుంటూరులోని ఎల్బీ నగర్, ప్రగతి నగర్, సుద్దపల్లి డొంక, జూన్ షాహెద్ ప్రాంతాలలో పర్యటించారు. ప్రగతినగర్ , జూన్ షాహెద్ ప్రాంతాల్లో వర్షం నీటిలోనే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు నసీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులు నడుచుకుంటూ వెళ్ళి వర్షం నీరు చేరిన ఇళ్ళను పరిశీలించి, స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. బాదితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని భరోసా కల్పించారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …