Breaking News

వర్షం నీరు ఇళ్లల్లో నిల్వ ఉండకుండా సమగ్ర చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వర్షం నీరు ఇళ్లల్లో నిల్వ ఉండకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని, నగర ప్రజలు కూడా డ్రైన్లను శుభ్రం చేయడానికి వీలు లేని విధంగా వాటి మీదకు నిర్మాణాలు చేపట్టవద్దని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం స్థానిక జున్ను షాహిద్ నగర్, బిఆర్ స్టేడియం, శ్రామిక నగర్ ప్రాంతాల్లో డిఈఈ శ్రీధర్ తో కలిసి పర్యటించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాలకు ఇళ్లల్లోకి వచ్చిన నీటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. లో లెవల్ ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షం నీరు వెళ్లిందని, నీటి తొలగింపుకు ఆయా ప్రాంతాల్లో కచ్చా డ్రైన్ లు ఏర్పాటు చేశామన్నారు. శ్రామిక నగర్, జున్ను షాహిద్ నగర్, బి ఆర్ స్టేడియంలో నిలిచిన నీటిని బెయిల్ అవుట్ చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో భవిష్యత్ లో వర్షానికి నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని డిఈఈని ఆదేశించారు. నగర ప్రజలు కూడా తమ ఇళ్ళ ర్యాంపులు డ్రైన్ మీదుగా రోడ్ల మీదకు, డ్రైన్ల మీద నిర్మాణాలు చేపట్టడం వలన నీరు పారుదలకు అడ్డంకి ఏర్పడి ఇళ్ళల్లోకి నీరు వస్తుందన్నారు. నగరంలో డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణల తొలగింపు చేపట్టామని, నగర ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *