Breaking News

సహాయక చర్యల్లో బాధ్యతారాహిత్యం..వీఆర్వో పి.జయలక్ష్మికి షోకాజు నోటీసు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినట్లు ఫిర్యాదు నేపథ్యంలో 259వ వార్డు సచివాలయం వీఆర్వో పి.జయలక్ష్మికి షోకాజు నోటీసు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సోమవారం తెలిపారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో నిత్యవసర సరుకుల పంపిణీ పాయింట్ వద్ద పబ్లిక్ తో అమర్యాదగా ప్రవర్తించిన ఆరోపణలు నేపథ్యంలో షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకవైపు వరదను నియంత్రించే చర్యలతో పాటు మరోవైపు బాధితులకు సహాయ సహకారాలు అందించడంపై ప్రతిష్టాత్మకంగా దృష్టి సారించినందున బాధ్యతగా వ్యవహరించాల్సిన వారు నిర్లక్ష్యం వహించినా, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు ఆపన్నహస్తం అందించడంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సృజన సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *