క్షయ వ్యాధిపై అవగాహనా శిబిరాలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో ఆటోనగర్ మొదటి క్రాస్ మూడవ రోడ్డు కావేరి లాడ్జి వర్ష 15 రోజుల క్షయ వ్యాధి అవగాహనా శిబిరాలను సి.హెచ్. దినేష్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణా సమన్వయకర్త ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ పై అవగాహనా శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అని, గోరు, వెంట్రుక కు తప్ప శరీరంలో ఏ అవయవాన్నికైన క్షయ వ్యాధి సోకే ప్రమాదముందని, వ్యాధిసోకిన వ్యక్తి మాట్లాడే సమయంలో, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సులభంగా వ్యాధి సోకే ప్రమాధముందని అన్నారు. క్షయవ్యాధి లక్షణాలైన రౌండు వారాలకు మించి దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు కోల్పోవడం, తరచూ జ్వరం రావడం లోని ఏఒక్కటి ఉన్నా ఆలస్యం చేయకుండా దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రం కు గాని గవర్నమెంటు ఆసుపత్రికి గాని వెళ్ళి పరీక్ష చేయించుకోవాలని అన్నారు. ఒక పీల క్షయ గా నిర్ధారణ అయితే గవర్నమెంటు వారు ఉచితంగా మందులు, పౌషి ఆహారం కొరకు ఆరు నెలల పాటు 500 వందల రూపాయలను ఇస్తారని, కావున క్రమం తప్పకుండా మందులను తీసుకుంటే వ్యాధి తగ్గుతుందని ఆయన అన్నారు. కనుక దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన ను కలిగి ఉండాలని ఆయన అన్నారు. క్షయవ్యాధి ని అంతమొందించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు.

ప్రాజెక్ట్ మేనేజర్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా 15 రోజుల పాటు ఈ రోజు నుండి సెప్టెంబరు 30 వరకు వివిధ కూడలిలో సిబ్బంది ఆటోనగర్ లోని కార్మికులకు స్లిప్ చార్జ్, పాంప్లెట్స్ ద్వారా అవగాహన కల్పిస్తూ లక్షణాలున్న వారికి పరీక్ష ఉచితంగా చేయిస్తామని. క్షయ గా నిర్ధారణ అయితే ఉచితంగా చికిత్సను గవర్నమెంట్ వారి సహకారంతో అందిస్తానని ఆయన అన్నారు.

కార్యక్రమంలో మెడికల్ అధికారి ఆర్. స్వర్ణలత, సత్యప్రసాద్, వీరాంజనేయులు, రామసాగర స్మిత, ఫిరోజ్,కె.డి.యల్.ఒ సిబ్బంది రాయప్ప, ఎ.వి ప్రసాద్, శేషు, పీర్ ఎడ్యుకేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *