-రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,ఆర్టిజి, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం
రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి గురువారం రాత్రి 7.30 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టిజి, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది.
మంత్రివర్యులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద రావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిడి నెల్లూరు ఎమ్మెల్యే విఎం.థామస్, అదనపు ఎస్పీ నాగభూషణం రావు, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్, జిల్లా విద్యా శాఖ అధికారి శేఖర్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం కలెక్టర్ మంత్రి లోకేష్ కు సిఎం రిలీఫ్ ఫండ్ కు చెందిన రూ. 57,48,408 మెగా చెక్కును అందజేశారు. విమానాశ్రయం వెలుపల టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి రోడ్డు మార్గాన చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు, రోడ్డు మార్గంలో పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు హర్ష ద్వానాలతో ఘన స్వాగతం పలికారు.