-ఇప్పటికే రూ. 27.93 కోట్ల విలువైన 4,500 క్లెయిమ్‌ల పరిష్కారం
-జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతోందని.. ఇప్పటికే రూ. 27.93 కోట్ల విలువైన 4,500 క్లెయిమ్‌ల పరిష్కారం జరిగినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన గురువారం తెలిపారు.
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బీమా ఫెసిలిటేషన్ కేంద్రంలో రూ. 79.86 కోట్ల విలువైన 10,130 మోటారు వాహనాల క్లెయిమ్‌లు రిజిస్టర్ కాగా వీటిలో 38.54 శాతం అంటే 3,904 క్లెయిమ్‌లు (రూ. 13.50 కోట్లు) సెటిల్‌మెంట్ అయినట్లు తెలిపారు. అదేవిధంగా రూ. 175.54 కోట్ల విలువైన 1,593 నాన్ మోటారు క్లెయిమ్‌లు రిజిస్టర్ కాగా వీటిలో 37.41 శాతం అంటే 596 క్లెయిమ్‌లు (రూ. 14.43 కోట్లు) సెటిల్‌మెంట్ అయినట్లు పేర్కొన్నారు. మోటార్, నాన్ మోటార్ మొత్తంమీద రూ. 255.4 కోట్ల విలువైన 11,723 క్లెయిమ్‌లు రిజిస్టర్ కాగా వీటిలో 38.39 శాతం అంటే 4,500 క్లెయిమ్‌లు (రూ. 27.93 కోట్లు) సెటిల్‌మెంట్ అయినట్లు వివరించారు. క్లెయిమ్‌ల పరిష్కారంపై గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టిసారించారని.. నిరంతర పర్యవేక్షణతో క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు.
అదే విధంగా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, ఏసీ మెకానిక్ తదితర సేవలు పొందేందుకు 57,979 మంది అర్బన్ కంపెనీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని.. ఇప్పటివరకు నికరంగా మొత్తం 4,415 సర్వీస్ రిక్వెస్టులు నమోదయ్యాయని.. వీటిలో 95.7 శాతం మేర విజ్ఞప్తులకు సేవలందించడం పూర్తయిందని కలెక్టర్ వివరిందారు.