Breaking News

యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

-పరీక్షకు హాజరు కానున్న 136 మంది అభ్యర్థులు…
-డిఆర్వో వి. శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 20వ తేది శుక్రవారం నుండి 22వ తేదీ వరకు తిరిగి 28, 29 తేదీలలో ఐదు రోజుల పాటు నిర్వహించే యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు చేసిన ఏర్పాట్లను సరిచూసుకోవాలని డిఆర్వో వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు చేసిన ఏర్పాట్లపై గురువారం డిఆర్వో వి. శ్రీనివాసరావు నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లైజనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లు, వెన్యూ సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్వో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ యుపిఎస్సి మెయిన్స్ పరీక్షలను నగరంలోని మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఈనెల 20,21,22 తేదీలు మరియు 28,29 తేదీలలో ఐదురోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు 136 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఈనెల 20వ తేదీ శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, పేపర్-1 ఎస్ఐ పరీక్షను, 21వ తేది శనివారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, పేపర్ -2లో జనరల్ స్టడీస్-1, 21వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల నుండి సా. 5:30 గంటల వరకు పేపర్ -3లో జనరల్ స్టడీస్ -2, 22వ తేదీ ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, పేపర్ -4లో జనరల్ స్టడీస్-3, 22వ తేదీ పేపర్-4 లో జనరల్ స్టడీస్ -4, తిరిగి 28వ తేదీ ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పేపర్-ఏలో ఇండియన్ లాంగ్వేజ్, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సా.5:30 గంటల వరకు పేపర్ -బి ఇంగ్లీష్, 29వ తేదీ ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పేపర్ -6లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సా.5:30 గంటల వరకు పేపర్-7లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2 పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

పై పరీక్షల నిర్వహణకు ఏడుగురు ఇన్విజిలేటర్లను నియామించామన్నారు. ఒక విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు ఇద్దరు వెన్యూ సూపర్వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్ సూపర్వైజర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని, ముఖ్యంగా త్రాగునీరు, అవసరమైన మందులతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థుల హాల్ టిక్కెట్లలో నమోదు చేసిన పరీక్ష కేంద్రం పేరు అభ్యర్థి వ్రాసే పరీక్ష కేంద్రం ఒకే విధంగా ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. పరీక్ష కేంద్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, విధ్యుత్ కు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా ఏపీఎస్ ఆర్టీసీ ఆయా రూట్లలో బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్వో వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.

పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధి విధానాలపై జిల్లా రెవెన్యూ అధికారి, పరీక్షల కస్టోడియన్ అధికారి డిఆర్వో వి. శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. సమావేశంలో యుపిఎస్సి జాయింట్ సెక్రటరీ సంతోష్ అజ్మీరా, అండర్ సెక్రటరీ సుశీల్ కుమార్, ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. కె. భాగ్యలక్ష్మి, లెక్చరర్. తుంబురు ఆర్యపతి, అసిస్టెంట్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *