Breaking News

“ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేసి 28 వ వంసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ట్రస్టు తరపున పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పర్యటన లో భాగంగా ఉదయం 10.30 గంటలకి రాజమహేంద్రవరం , ప్రకాష్ నగర్(డోర్ నెంబర్ 75-6-32 & 33) నందు “ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అంబులెన్స్ సేవలను ప్రారంభిస్తారు. తదుపరి మ.12.30 గంటలకి రాజమండ్రీ రూరల్ కొంతమూరు లో ఎన్ టి ఆర్ సంజీవని ఉచిత ఆరోగ్య రథం ను ప్రారంభించడం జరుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *