Breaking News

అక్టోబర్ 2, 2024 గాంధీ జయంతి సందర్భంగా కబేళా, చేపల మార్కెట్లు, మాంసపు దుకాణాలకు సెల‌వు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ 2, 2024 గాంధీ జయంతి సందర్భంగా సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఉత్తర్వుల మేరకు 02-10-2024 తేదిన (బుధవారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించారు. బుధవారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన యెడల, లేదా షాపులను తెరిచియుండి మటన్, చికెన్ మరియు చేపలను అమ్మిన యెడల చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోనబడునని కమిషనర్ ఆదేశించారు. కావున మటన్, చికెన్, చేపలు హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులు అన్ని షాపులు మూసి వేయవలెనని ఆదేశించడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *