Breaking News

ఆర్జీల పరిష్కారనికి విభాగాధిపతులే భాధ్యత తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇస్తున్న ఆర్జీల పరిష్కారనికి విభాగాధిపతులే భాధ్యత తీసుకోవాలని, అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారాన్నిఅందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రతి సోమవారం గత వారం అందిన ఆర్జీల పరిష్కారాలపై సమీక్ష చేస్తామని, కనుక ప్రతి అర్జీ సమగ్రంగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జీలు పునరావృతం కాకుండా, నాణ్యమైన పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్ల ఆక్రమణ వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిఎంసి కార్యాలయానికి వస్తున్నారని, అవి స్థానికంగానే పరిష్కారం చేయాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండార్స్మెంట్ ను ఆయా విభాగాధిపతులు పరిశీలించాలన్నారు. ప్రజల నుండి అందే అర్జీలు, ఫిర్యాదుల నమోదుకి ప్రతి విభాగంలో ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు 55 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 14, ఇంజినీరింగ్ విభాగం 26, రెవెన్యూ విభాగం 7, ప్రజారోగ్య విభాగం 3, అకౌంట్స్ విభాగంకి సంబందించి 3, ఉపా సెల్ కి సంబందించి 1, ఎన్నిల విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, డి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్.ఈ. శ్యాం సుందర్, ఎంహెచ్ఓ మధుసూదన్, మేనేజర్ ప్రసాద్, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డిసిపిలు, ఏసిపిలు, ఈఈలు, ఆర్ఓలు, ఎస్ఎస్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *