Breaking News

జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగిన అక్టోబర్ నెలకు సంబందించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ

-జిల్లాలో 2,66,342 మంది లబ్దిదారులకు సుమారు రూ.112.71 కోట్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేపట్టాం: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం పండుగ వాతావరణంలో జరిగిందని ఉదయం 6 గం.ల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి జిల్లాలో 2,66,342 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా రూ.112.71 కోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం 6 గంటలకు తిరుపతి పట్టణంలోని అక్కారం పల్లి, సుబ్బారెడ్డి నగర్ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పాల్గొని పింఛన్లను పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని వివరాలు అడగగా అందరూ ఎంతో సంతోషంగా పెరిగిన పెన్షన్లు క్రమం తప్పకుండా అందుతున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం వృద్దాప్యం, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, HIV వ్యాధి గ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు రూ.3,000/- ల నుండి రూ.4,000/- వరకు పెంచడమైనది. అలాగే వికలాంగుల పెన్షన్ లు రూ.3,000/- ల నుండి రూ.6,000/- వరకు పెంచడమైనది. DMHO పెన్షన్ లు రూ.5,000/- ల నుండి రూ.10,000/- వరకు పెంచడమైనది. ఇందులో శాశ్వత వికలాంగులకు రూ.5,000/- ల నుండి రూ.15,000/- వరకు పెంచడం జరిగిందని అందులో భాగంగా ప్రతి నెలా 1 వ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజల ఇంటి వద్దకే పించన్ పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని లబ్ధిదారులకు వంద శాతం పించన్ పంపిణీ చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా పించన్ అందుకున్న లబ్దిదారులు 1 వ తేదీన క్రమం తప్పకుండా పించన్ అందుతోందని ఆలస్యం లేకుండా పెన్షన్ పంపిణీ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

నేడు పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే లు, ప్రజా ప్రతినిధులు సచివాలయం సిబ్బందితో కలిసి ఉదయం నుండి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 2,66,342 మంది లబ్దిదారులకు సుమారు రూ.112.71 కోట్లు పంపిణీకి చర్యలు చేపట్టామని అన్నారు. ఏదేని కారణం చేత పెన్షన్ల నేడు తీసుకోలేని వారికి అక్టోబర్ 3 వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని, తప్పకుండా వారు వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *