తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అమరావతి నుండి ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణపై- 2025 కార్యక్రమం అమలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య మరియు సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిఈఓ గారికి వివరిస్తూ జిల్లాలో ఇంటింటి ఫోటో ఎలక్టోరల్ జాబితా వెరిఫికేషన్ 99.81 శాతం అయింది అని తెలిపారు. అన్ని ఫారం లకు సంబంధించి 25473 పెండింగ్ క్లెయిమ్స్ మరియు అబ్జెక్షన్స్ ఉన్నాయని, పురోగతిలో ఉన్నాయని గడువు లోగా పూర్తి చేస్తామని తెలిపారు. రిజిస్టార్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నివేదిక మేరకు ఇప్పటివరకు చనిపోయిన వారి వివరాలు 7117 కు గానూ అందులో 6305 అప్లికేషన్లు వెరిఫికేషన్ పూర్తి అయిందని, 812 వెరిఫికేషన్ పురోగతిలో ఉన్నాయని అక్టోబరు 3 లోపల పరిష్కరిస్తామని సిఈఓ గారికి కలెక్టర్ తెలియజేసారు. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిన్నటి దినాన సోమవారం నిర్వహించామని వివరించారు. అందరు ఈఆర్వోలు, ఎఈఆర్ఓ లు, బిఎల్ఓల వివరాలు ఈ ఆర్ ఓ నెట్ నందు అప్డేట్ చేశామని తెలిపారు. తొందరలోనే హైయర్ ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ల వారికి క్యాంపులు నిర్వహించే షెడ్యూల్ ను ఈనెల 3 తేదీ నాటికి పంపిస్తామని వివరించారు. అలాగే ఏఈఆర్వోలు సూపర్వైజర్లు బిఎల్ఓ లకు ఆగస్టు 22న, సెప్టెంబర్ 4న మరియు సెప్టెంబర్ 9న శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ నిబంధనల మేరకు చేపడుతున్నామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు డిఆర్ఓ పెంచల కిశోర్ , కలెక్టరేట్ ఎన్నికల విభాగపు సిబ్బంది, ERO లు, డిప్యూటీ తాహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News