విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి మంగళవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపి మాగుంట తో పాటు విచ్చేసిన ఆయన తనయుడు రాఘవరెడ్డి కూడా ఎంపి కేశినేని శివనాథ్ కలవటం జరిగింది. ఎంపి మాగుంట కు ఎంపి కేశినేని శివనాథ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం వీరు రాష్ట్రానికి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధుల గురించి, రాష్ట్రంలో అభివృద్ది నిరోధక శక్తుల్ని ఎలా ఎదుర్కొవాలనే అంశాలపై చర్చించుకున్నారు.
Prajavartha Online Telugu News