Breaking News

ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమం వేదికగా సాగుతున్న అసత్య ప్రచారంపై సిఎం సీరియస్

-కఠిన చర్యలకు వెనుకాడవద్దని గునుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత ఇసుక విధానంపై సామాజిక మాధ్యమం వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వం పూర్తి ఉచితంగా పారదర్శక విధానంలో రాష్ట్ర ప్రజలకు ఇసుకను అందిస్తున్నప్పటికీ, ప్రజలను తప్పుదారి పట్టించేలా జరుగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను సిఎం అదేశించారు. ఉద్దేశ పూర్వకంగా అబద్దాలతో ఉచిత ఇసుక విధానంపై ప్రజలలో అనుమానాలు రెకెత్తెలా జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేసారు. ఇందుకు అయా జిల్లాల పాలనాధికారులు, పోలీస్ సూపరిండెంట్ లకు తగిన అదేశాలు జారీ చేయాలని, ఈ తరహా వ్యవహారాలపట్ట కఠినంగా వ్యవహరించాలని మీనాను అదేశించారు. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై జిల్లా స్ధాయిలో నిజనిజాలను వెలికితీసి బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు గనులశాఖ ముఖ్య కార్యదర్శికి స్పష్టమైన అదేశాలు జారీ చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *