Breaking News

రూ. 115కే పామాయిల్ ప్యాకెట్

– ఈ నెల 9వ తేదీ నుంచి అన్ని రైతుబజార్లలో అందుబాటు.
– జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెరిగిన వంట నూనెల ధరలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 9వ తేదీ బుధవారం నుంచి అన్ని రైతు బజార్లలో రూ. 115కే పామాయిల్ ప్యాకెట్ అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ నిధి మీనా.. పౌరసరఫరాల అధికారులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు తదితరులతో జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ధనల స్థితిగతుల మేరకు రైతు బజార్లలో గతంలో బియ్యం, కందిపప్పు తదితర నిత్యవసర సరుకులను తక్కువ ధరలకు రైతు బజార్లలో అందుబాటులో ఉంచడం జరిగిందని.. ఇదేవిధంగా ఇప్పుడు వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో పామాయిల్ ను తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ ఏర్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు, వ్యాపార సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *