రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజానగరం మండలం జి. యర్రంపాలెం నకు చెందిన దివ్యాంగులు పెదపాటి గోపాలకృష్ణ తనకు గతంలో కేటాయించిన రేషన్ షాపు ను బైఫరికేషన్ కింద విభజించు చున్నట్లు తెలియ వచ్చిందని, తనకి తగు న్యాయం చెయ్యాలని పేర్కొన్నట్లు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి సహేతుకమైన విధానంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. పెదపాటి గోపాలకృష్ణ వద్దకు వెళ్లి సమస్య వివరాలు తెలుసుకోవడం జరిగింది.
Prajavartha Online Telugu News