Breaking News

జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్ మరియు అపరిశుభ్రమైన మరుగుదొడ్లు (ఇస్-సానిటరి లెట్రిన్ ) లేని జిల్లాగా ప్రకటన

-వీటిపై వరకూ అభ్యంతరాలను అక్టోబరు 24 వరకూ స్వీకరిస్తాం
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సర్వే ఆధారంగా తూర్పు గోదావరి జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్ మరియు అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేని జిల్లాగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

సుప్రీం కోర్టు వారీ ఆదేశాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీలలో , రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలు పురపాలక సంస్థల పరిథిలో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. సర్వే లో తూర్పు గోదావరి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ ఎవ్వరూ లేరని, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేవని జిల్లా పంచాయితీ కార్యాలయము ,  జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయముల నుండి నివేదికలు అందాయని తెలియ చేశారు. సదరు నివేదికలు ఆధారంగా తూర్పు గోదావరి జిల్లాని మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ  , అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేని జిల్లాగా ప్రకటించడం జరిగినదని ఆమె తెలిపారు.

అక్టోబర్ 24 వరకు అభ్యంతరాలు స్వీకరణ:
ఈ విషయంపై ఏమైనా అభ్యంతరములు ఉన్నచో ది.24.10.2024వ తేది లోపు సంబంధిత మున్సిపాలిటి/మండల ప్రజా పరిషత్ అధికారులు ద్వారా మీ వివరములను జిల్లా షెడ్యుల్ కులముల సంక్షేమ మరియు సాధికారత కార్యాలయము, ఆర్డీవో కార్యాలయం ఆవరణ, రాజమహేంద్రవరం , తూర్పు గోదావరి జిల్లా వారికీ తెలియ చేయ వలసినదిగా  కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *