Breaking News

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా దుర్గామాత దీవించాలి : ఎం.పి కేశినేని శివ నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం విద్యాధర పురం క్వారీ సెంటర్లో శ్రీ కనకదుర్గమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపం లో మహిషాసుర మర్దిని అవతారం లో దర్శనమిచ్చిన అమ్మవా రిని ఎంపీ కేశినేని శివ నాథ్ శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ కనకదుర్గమ్మ సేవా సమితి నిర్వాహకులు ఏం.పి కేశినేని శివ నాథ్ కి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎంపీ కేశినేని శివ నాథ్ కి పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రం సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడుస్తుందని, అలాగే రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని వేడుకున్నట్లు ఎం.పి కేశినేని శివ నాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.శివ శర్మ, నక్కా కృష్ణ, నక్కా బాలాజీ, సింగిరెడ్డి ప్రదీప్ రెడ్డి, చక్కా సత్యనారాయణ, కొప్పురావూరి తేజ, కొత్త ఫణి పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *