Breaking News

బాబా దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మికతోనే ప్రశాంతమైన జీవితం గడపవచ్చని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. షిరిడీ సాయిబాబా పుణ్యతిథిని పురస్కరించుకుని ముత్యాలంపాడు శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు బాబాకి ప్రత్యేక అభిషేకాలు చేశారు. వివిధ పుష్పాలతో అలంకరించి సాయిబాబాను సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డితో కలిసి మల్లాది విష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి.. బాబా సమాధికి హారతినిచ్చారు. విజయదశమి రోజున షిర్డీ సాయిబాబా తుదిశ్వాస విడిచారని.. దసరా మరుసటి రోజు ఆశ్వయుజ మాస ఏకాదశిన నిర్వహించే పుణ్యతిథి వేడుకలకు ఎంతో విశిష్టత ఉందని మల్లాది విష్ణు అన్నారు. బాబా దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ పాలక మండలి మల్లాది విష్ణుని ఘనంగా సన్మానించారు. ఆయన వెంట 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, యల్లాప్రగఢ సుధీర్, కుంచనపల్లి రవిశంకర్, మందలపర్తి సత్యశ్రీహరి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *