Breaking News

జిల్లాలో అక్టోబర్ 29 నైపుణ్య గణన శిక్షణ

-30 రోజుల పాటు సచివాలయ సిబ్బందిచే నైపుణ్య గణన
-సమన్వయ శాఖల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమ కార్యాచరణ
-జాయింట్ కలెక్టరు ఎస్ చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అక్టోబరు 29 నుంచి నైపుణ్య గణన 30 రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజులపాటు నైపుణ్య గణన చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయి నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్, మండల స్థాయి నోడల్ అధికారిగా మండల పరిషత్తు అభివృద్ది అధికారి వ్యవహరిస్తారన్నారు. జిల్లా స్థాయి నైపుణ్య గణన శిక్షణ ఎపిఎసెస్డిసి మాస్టర్ ట్రైనర్ అధ్వర్యంలో మండల స్థాయి, మునిసిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘంలకి 29/10/2024న నైపుణ్య గణన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించ నున్నట్లు తెలిపారు.

సంబంధిత శిక్షణా కార్యక్రమానికి గ్రామ వార్డు సచివాలయం నుంచి ఇద్దరేసి చొప్పున కార్యదర్శులు హజరై వారు మండల స్థాయి సిబ్బందికి నైపుణ్య గణన శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందు కోసం సచివాలయం పరిథిలో ఉన్న అందరి సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు ప్రజా ప్రతినిధులందరికీ నైపుణ్య గణన సర్వే గురించి వివరించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని సమన్వయ శాఖల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమ కార్యాచరణ సిద్దం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని మండలాల్లో 30 రోజుల్లో సర్వే పూర్తి చేయాలనీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *