Breaking News

పంట కాలువ కబ్జాపై ఉప ముఖ్యమంత్రి ఆగ్రహం

-తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశం
-ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం… పంట కాలువ పునరుద్ధరణకు చర్యలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం నియోజకవర్గంలోని కోలంక గ్రామంలో పంట కాలువను కబ్జా చేసిన ఘటన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. ఈ అంశంపై రెవెన్యూ, పంచాయతీరాజ్, జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. 60 ఎకరాలకు సాగు నీరు వెళ్ళే పంట కాలువను లే ఔట్ కోసం కబ్జాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఆదేశించారు. తక్షణమే పంట కాలువను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. గతంలో సర్వే చేసిన ఎందుకు ఆక్రమణలు తొలగించలేదని అధికారులను ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గ వద్దని శ్రీ పవన్ కల్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో ‘ఎవరు తప్పు చేసినా… నాతో సహా… ఉపేక్షించవద్దు. చట్టం, నిబంధనలకు అనుగుణంగా వెళ్ళాలి’ అని చెప్పిన మాటలను అధికారులకు గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. కోలంక గ్రామంలో గ్రావెల్ తో పంట కాలువను పునరుద్ధరించే పనులను మొదలుపెట్టారు. పంట కాలువ పూర్వ స్థితికి తీసుకువచ్చే పనులు చేస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *