Breaking News

ఈ నెల 26న ఏపీ జీఎన్ఏ రాష్ట్ర ఆఫీస్ బేర‌ర్ల ఎన్నిక‌లు

-ఏపీ జీఎన్ఏ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి ఎస్‌.శ్రీనివాస‌రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ న‌ర్సుల అసోసియేష‌న్ (ఏపీ జీఎన్ఏ) ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా ఈ నెల 26న అసోసియేష‌న్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల ఎన్నిక జ‌ర‌గ‌నుంద‌ని ఎన్‌టీఆర్ జిల్లా కోఆప‌రేటివ్ అధికారి, ఏపీ జీఎన్ఏ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి ఎస్‌.శ్రీనివాస‌రెడ్డి శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అసోసియేష‌న్ బైలాస్‌, ఏపీ సీఎస్ (ఆర్‌వోఎస్ఏ) నిబంధ‌న‌లు-2001 ప్ర‌కారం అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని, ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ శ‌నివారం విజ‌య‌వాడ‌, ఎంజీరోడ్‌, రాఘ‌వ‌య్య పార్కు స‌మీపంలోని కృష్ణా జిల్లా కోఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఉద‌యం ఏడు గంట‌ల‌కు చేప‌ట్టే రాష్ట్ర ఆఫీస్ బేరర్ల ఎన్నిక ప్ర‌క్రియ‌కు సంబంధించిన స‌మావేశానికి ఎన్నికైన జిల్లా యూనిట్ల ఆఫీస్ బేర‌ర్లు హాజ‌రుకావాల‌ని శ్రీనివాస‌రెడ్డి సూచించారు. సంబంధిత జిల్లా ఎన్నిక‌ల అధికారి జారీచేసిన ఒరిజ‌న‌ల్ డిక్ల‌రేష‌న్ ఫారం (ఫారం 12)తో పాటు ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాల‌ని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *