Breaking News

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే నగరంలో 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కమిషనర్ గారు పండరీపురం, అశోక్ నగర్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, పనులపై అసహనం వ్యక్తం చేసి స్థానిక శానిటేషన్ కార్యదర్శిని విధుల నుండి సస్పెండ్ చేయాలని, అరండల్ పేట మెయిన్ రోడ్ లో శంకర్ విలాస్ ఆర్ఓబి మార్కింగ్ ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత పండరీపురం 2,3 లైన్లు పరిశీలించి, రోడ్ల మీద గార్బేజ్ కుప్పలు ఉండడం, డ్రైన్లలో మురుగుపారుదల లేకుండా ఉండడం గమనించి, పారిశుధ్య పనులపై స్థానికుల ఫిర్యాదులను తీసుకొని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న స్థానిక శానిటేషన్ కార్యదర్శి ఎం.రాజకుమారిని విధుల నుండి సస్పెండ్ చేయాలని సిఎంఓహెచ్ ని ఆదేశించారు. గత 10 రోజుల నుండి నగర పరిశుభ్రత కోసం 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం, ప్రత్యేక పర్యవేక్షణకు సీనియర్ అధికారులను కేటాయించడం వంటి చర్యలు తీసుకుంటూ, టెలి కాన్ఫరెన్స్, క్షేత్ర స్థాయి పర్యటనల్లో పారిశుధ్య పనులపై కార్మికులు, కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లకు అవగాహన కల్గిస్తున్నప్పటికీ కొందరిలో మార్పు లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యదర్శులు మరింత భాధ్యతగా విధులు నిర్వహించాలని, ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం చేస్తే రోడ్ల మీద వ్యర్ధాలు ఉండవన్నారు. కమర్షియల్ సంస్థలు రోడ్ల మీద వ్యర్ధాలు వేస్తే భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలన్నారు. అశోక్ నగర్ మెయిన్ రోడ్ ని పరిశీలించి, వీధి దీపాల సమస్య పై ఫిర్యాదులు అందుతున్నాయని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిఈఈని, భవన నిర్మాణ సామాగ్రి రోడ్ల మీద, డ్రైన్ల మీద వేయకుండా చూడాలని ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం శంకర్ విలాస్ ఆర్ఓబి మార్కింగ్ ని అరండల్ పేట మెయిన్ రోడ్ లో పరిశీలించి, మార్కింగ్ వేగవంతం చేసి నివేదిక ఇవ్వాలని, అందుకు తగిన విధంగా సిబ్బందిని కేటాయించుకోవాలని ఏసిపిని ఆదేశించారు.
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ కళ్యాణ రావు, ఏసిపి రెహ్మాన్, ఎంహెచ్ఓ ఆనందకుమార్, స్పెషల్ శానిటేషన్ ప్రత్యేక అధికారి నిరంజన్, ఎస్.ఎస్. సోమశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ.బాబు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *