ప్రతీ మహిళా ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపారవేత్తలుగా రాణించాలి….

– వైయస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి 14 కంపెనీలతో ఒప్పందం…
– వైయస్ఆర్ చేయూత ద్వారా 8 వేల కోట్లు ఆర్థిక సహాయాన్ని 24 లక్షలమంది మహిళలకు అందించాం…
– రాష్ట్రంలో 6 లక్షల మంది మహిళలకు శిక్షణ, వ్యాపార నైపుణ్యం, మార్కెటింగ్ అందించుట పై ఒప్పంద కంపెనీలు పనిచేస్తాయి…
-రాష్ట్ర మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి
-బొత్స సత్యనారాయణ
-కురసాల కన్నబాబు
-పీదిరి అప్పలరాజులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రతీ మహిళా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో తాము నివాసం ఉండే ప్రాంతంలోనే ఒక వ్యాపారవేత్తగా తయారు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అందజేస్తున్న వై.యస్.ఆర్. చేయూత కార్యక్రమానికి ప్రోత్సహించేందుకు 14 ప్రధాన కంపెనీలతో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజుల సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలపై పోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనరు కార్యాలయంలో సంతకాలు చేశారు. ఒప్పందం చేసుకున్న కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. జియో బిజినెస్, జివికె సొసైటీ, యంటే జీపీయల్ అండ్ కెటి పియల్, మహేంద్రా, కీటీ కంపెనీలు, టానేజర్, ఇర్మా, బేసిక్స్, గయాన్, యఫ్ డి ఆర్ సి, వెడ్స్ అండ్ గ్రీక్స్, ఎంట్రపెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇవిష్ట్యిట్యూట్ ఇండియా, వేషవల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్, రైతు సాధికారికత సంస్థ, ఏపి ఫుడ్ ప్రొసెసింగ్ పొపెటీ, వాప్స్ కం పెనీలు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యస్ సి, యటి, బిసి, మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ. 75 వేల రూపాయలు నాలుగు విడతలుగా మంజూరు చేస్తున్నది. వ్యాపారాలు మొదలు పెట్టాలనే మహిళలకు బ్యాంకు రుణం కూడా కలుపుకుని ఆమొత్తాలతో సరైన వ్యాపారాలు నిర్వహించేలా పై సంస్థలు ప్రోత్సహించి వ్యాపారంలో ముందడుగు వేసేలా ఈకం పెనీలు అన్నీ ప్రోత్సాహకం అందజేస్తాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజంలో నిర్లక్ష్యానికి గురి అయిన వర్గాలకు, మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి రాష్ట్రంలో వై.యస్.ఆర్. చేయూత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఈపధకం క్రింద ప్రతీ మహిళకూ రూ. 75 వేల రూపాయలను 4 విడతలుగా అందిస్తున్నామని, ఇంతవరకూ రెండు విడతలుగా రూ. 8 వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని 24 లక్షలమంది మహిళలకు అందించామని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్థిక సహాయానికి అదనంగా వివిధ ఆర్థిక సంస్థల నుంచి ఈ సంవత్సరం 2 లక్షల 67 వేలమందికి రూ. 15.07 కోట్లు బ్యాంకు రుణాలుగా అందించామని మంత్రి అన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు ఆయా గ్రామాల్లోనే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చేయూత కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థికంగా బలో పేతమై వివిధ వ్యాపారాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆవ్నారు. వై.యస్.ఆర్. చేయూత కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు తగు సూచవలు అందించి వారిని ప్రోత్సహించి వ్యాపారవేత్తలుగా తయారు చేయుటకు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలు అందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. గత సంవత్సరం ఈ ప్రముఖ కంపెనీలతో ఒప్పందం తీసుకుని 3 లక్షల మందిని వివిధ వ్యాపారాల్లో వైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దామని ఈ సంవత్సరం 14 కంపెనీలతో ఒప్పందం చేసుకుని ర లక్షల మందికి శిక్షణ, వ్యాపార మెళుకువలు, మార్కెటింగ్, తదితర సహకారాన్ని అందిస్తున్నామని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.
రాష్ట్ర పురపాలకశాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలకు వై.యస్.ఆర్. చేయూత కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకుని మహిళలు మరింత ఆర్థికంగా బలపడేందుకు, వ్యాపారవేత్తలుగా తరూరయ్యేందుకు ఈరోజు 14 ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని మంత్రి అన్నారు. భవిష్యత్తులో మహిళలే మహారాణులుగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందిస్తున్న రూ. 75 వేల రూపాయలకు అదనంగా బ్యాంకు రుణాలను జోడించి మహిళలు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారని ఇది శుభ పరిణామం అని మంత్రి అన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి మాబలం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అని అన్నారు. ఏరాష్ట్రంలోనూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఇది బడుగు, బలహీన వర్గాల వారికి ఎంతో ప్రయోజన కరమని అని మంత్రి అన్నారు. హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో కూడా మహిళల భాగస్వామ్యం ఉండేలా నూతన ఆలోచనలతో కంపెనీలు ముందుకు రావాలని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతులకు, మహిళలకు ఉపయోగపడేలా పలు కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వై.యస్.ఆర్. చేయూతలాంటి విప్లవాత్మకమైన పథకాలను అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు.
రాష్ట్ర పశుగణాభివృద్ధి శాఖామంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏమహిళా ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ఇందుకు సంబంధించి యప్ సి, యటి, బిసి, మైనారిటీ మహిళలకు వై.యస్.ఆర్. చేయూత కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని మంత్రి అన్నారు. చేయూత ద్వారా వచ్చే సొమ్ము మహిళలకు ఉపయోగపడేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు ప్రముఖ కంపెనీలతో ఈరోజు ఒప్పందం చేసుకున్నామని మంత్రి అన్నారు. వై.యస్.ఆర్. చేయూత ద్వారా గత ఏడాది అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని మహిళలకు ఆర్థిక స్వావలంభన కల్పించే దిశగా ప్రయత్నం చేశామని మంత్రి అన్నారు. ఈ సంవత్సరం పౌల్టి, బ్యాక్ యార్డు ఖిల్జీ, మినీ పౌల్ట్రీలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి అప్పలరాజు అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, రాష్ట్ర పంచాయతిరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, మైనారిటీ సంక్షేమ శాఖ సెక్రటరీ, రైతు సాధికారిత సంస్థ సిఇఓ ఏ.యండి. ఇంతియ రాజబాబు, యండి మెప్మా వి. విజయలక్ష్మి, 14 ప్రముఖకం పెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *