“నో మాస్కు – నో ఎంట్రీ”…“నో మాస్కు – నో రైడ్”…”నో మాస్కు – నో సేల్”

-సెప్టెంబర్ వరకు వారంలో 3 రోజులు కోవిడ్ పై ప్రచారం
-జిల్లా కలెక్టర్ జె . నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ పై అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగించే దిశగా వారంలో మూడు రోజుల పాటు వినూత్నంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదని ఈ దృష్ట్యా ప్రజలంత కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సెప్టెంబర్ నెలఖారు వరకు ప్రతి వారంలో మూడు రోజుల పాటు ” నో మాస్క్ – నో ఎంట్రీ ” , ” నో మాస్క్ – నో రైడ్ ” , “ నో మాస్క్ – నో సేల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని , భౌతిక దూరం పాటించాలని , చేతులను తరచు శుభ్రపరచుకోవాలని ఆ ప్రకటనలో కలెక్టర్ నివాస్ సూచించారు. ప్రతి సోమవారం నో మాస్క్ -నో ఎంట్రీ నినాదంతో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోకి ప్రార్థన మందిరాల్లోకి , బ్యాంకులు , ఫోస్టు ఆఫీసులు , మాల్స్ , పబ్లిక్ పార్కులు , పరిశ్రమలు , వాణిజ్య ప్రాంతాలు , రెస్టారెంట్లులోకి మాస్కులు లేకుండా అనుమతించకూడదని ఈ అంశంపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు బ్యానర్లు , వాల్ పోస్టర్లు , మైక్ ద్వారా ప్రచారం నిర్వహించడంతోపాటు మాస్కులు పంపిణీ చేయాలన్నారు. ప్రతి మంగళవారం నో మాస్క్- నో రైడ్ నినాదంతో వాహన చోదకులు , ప్రయాణికులు , తప్పనిసరిగా మాస్కులను ధరించడంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రతి బుధవారం నో మాస్క్ -నో సేల్ అన్న నినాదంతో మాస్కులు ధరించని కొనుగోలు దారులకు దుకాణదారులు, సరుకులు, వస్తువులను విక్రయించకూడదన్నా ప్రచారాన్ని ముమ్మరం చేస్తామన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించి మూడు నెలల పాటు ఈ ప్రచార కార్యక్రమాలను రూపొందించిన్నట్లు తెలిపారు . ఇందులో భాగంగా బ్యానర్లు, ప్లేకార్డులు, ప్రదర్శించడం, కర్రపత్రాలు, స్టికర్లు , వాల్ పోస్టర్లు పంపిణీ చేయడం విషయాలపై సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. కోవిడ్ రహిత జిల్లాగా కృష్ణాజిల్లాను ఉంచేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ జె . నివాస్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *