-దీపావళి కానుకగా పండుగ వాతావరణంలో దీపం-2 కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా, యువజన & క్రీడల శాఖా మంత్రి
-దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుంది
-లక్షలాది మంది మహిళల కళ్ళల్లో సంతోషం చూడడానికి దీపం-2 పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు
-తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ, తద్వారా ప్రతీ లబ్ధిదారునికి సం.రానికి రూ. 2,600 లబ్ధి జరుగుతుంది
-చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి
గుడిపాల, నేటి పత్రిక ప్రజావార్త :
దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా, యువజన & క్రీడల శాఖా మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం జెడ్ పి హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో దీపం-2 కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా పండుగ వాతావరణంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా, యువజన & క్రీడల శాఖా మంత్రి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, జీడి నెల్లూరు,పూతలపట్టు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్,డా.వి.ఎం. థామస్,కలికిరి మురళీ మోహన్ లతో కలసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో మహిళలను ఉద్దేశించి ఇంచార్జ్ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా ఇస్తున్నారని, వాటిలో భాగంగానే నేడు శుక్రవారం దీపావళి పర్వదినాన లక్షలాది మంది మహిళల కళ్ళల్లో సంతోషం చూడడానికి దీపం-2 పథకాన్ని నిర్వహించడం జరిగిందని, దీపం సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారని, కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకొనే మహిళల వారి భాదను అర్ధం చేసుకొని 1990 సంవత్సరం లోనే దీపం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.లక్షలాది కుటుంబాల్లో వెలుగునిచ్చిన ప్రదాత ఆయన అని కొనియాడారు.ఇప్పుడు దీపం-2 పథకం తీసుకు రావడం,రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు దారులకు ఈ పథకం వర్తిస్తుందని, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సంవత్సరమునకు 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని,ఈ కార్యక్రమము ద్వారా ప్రతీ తెల్ల రేషన్ కార్డు దారులకు ఏడాది కి రూ. 2,600 లబ్ధి జరుగుతుందని తెలిపారు. ప్రతీ పేద కుటుంబాలలో సంక్షేమ పథకాలు వస్తున్నాయని అందులో రూ. 4000 పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు, ఉచిత ఇసుక, మెగా డి ఎస్ సి ని నిర్వహణలో 16,500 ఉద్యోగాలకు శ్రీకారం చుట్టామన్నారు.
చిత్తూరు శాసన సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఉన్న అనుభవంతో అనేక సంస్థలను తీసుకొని వచ్చి చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు పోర్టులు, కంపెనీలు ఏర్పాటు పై కృషి చేస్తున్నారని తెలిపారు.ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నేడు దీపావళి కానుకగా పేద మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే కార్యక్రమమునకు శ్రీకారం చూట్టామన్నారు.
పూతలపట్టు శాసన సభ్యులు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధముగా సూపర్ సిక్స్ అమలు చేస్తామని మాటివ్వడం జరిగిందని, పేద ప్రజల నిత్య జీవితంలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తామని మాటివ్వడం జరిగిందని,అందులో భాగంగా ఈ రోజు ఉచిత సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టారని, ఇచ్చిన మాట ప్రకారం,ఆడిన మాట తప్పకుండా గెలిచిన వెంటనే సూపర్ సిక్స్ లో ఒకటైన పెన్షన్లు పెంపును మూడు నెలల బకాయిలతో కలిపి లబ్ధిదారులకు అందించామని తెలిపారు. ఒకవేళ 1వ తేదీ ప్రభుత్వ సెలవు దినము అయితే 31 వ తేదీ రోజునే వారికి పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమమనేది మొదలయ్యిందే నందమూరి తారక రామారావు దగ్గరి నుండే అని కొనియాడారు. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టారని, అదే విదంగా ఇచ్చిన మాట ప్రకారం జనవరి నెలలో విధ్యార్థుల తల్లిదండ్రులకు తల్లికి వందనం పేరుతో రూ. 15,000 అందించబోతున్నామన్నారు.
గంగాధర నెల్లూరు(జీ డి నెల్లూరు) శాసన సభ్యులు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి ఉచిత సిలిండర్లు పంపిణీకి శ్రీకారం చుట్టారని, ముఖ్యమంత్రి సీ ఎం పదవి చేపట్టిన తరువాత మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలు పైన పెట్టారని, చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే రాష్ట్ర అభివృద్దిని తీసుకెళతారో అలాగే జిల్లా లోని ప్రతీ ఎం ఎల్ ఏ లమైన మేము వారి అభివృద్ధి మార్గంలో నడిచి జిల్లా, రాష్ట్ర అభివృద్దికితోడ్పడతామన్నారు.జిల్లా లో మెగా ఇండస్ట్రియల్ పార్క్,లాజిస్టిక్ పార్క్, ఐ టీ ఇండస్ట్రీలను, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ లను, ఎలెక్ట్రానిక్ ఇండస్ట్రీలు, ఆటో మొబైల్ ఇండస్ట్రీలు పెట్టి జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అదే విధంగా గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం తాము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల పెన్షన్ రూ.1000 పెంచుతామని, అరియర్ అయిన 3 నెలల బకాయిలు కూడా ఇవ్వడం జరిగిందని, మెగా డి ఎస్ సి నిర్వహించడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, ఇది మంచి ప్రభుత్వం అనేందుకు ఇవే రుజువులన్నారు.ముఖ్యమంత్రి గారు ఎలాగైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో చిత్తూరు జిల్లాని ఆదేవిధంగా అభివృద్ధి చేస్తామని, చిత్తూరు జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహణ, జిల్లా నందు విశ్వవిద్యాలయం నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దీపం-2 పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ,ఎం ఎల్ ఏలు, మేయర్,దొరబాబు,ఎ.ఎస్.మనోహర్,గాంధీ,కఠారి హేమలత,అధికారులు జడ్పీ సి ఈ ఓ రవి కుమార్ నాయుడు,చిత్తూరు ఆర్ డి ఓ శ్రీనివాసులు,డి ఎస్ ఓ శంకరన్,గుడిపాల తహసీల్దార్,ఎం పి డి ఓ చంద్ర శేఖర్ రెడ్డి,శివరాజ్, నాయకులు సి.ఆర్.రాజన్, కోదండయ్య,అట్లూరి శ్రీనివాసులు,హేమాద్రి నాయుడు,మోహన్ రాజ్, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News