Breaking News

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేయుచున్నాము

-ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరుచుటలో భాగంగా…
-ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా లబ్ధిదారులకు అందిస్తున్నాం
-ధర్మవరం నియోజకవర్గానికి 96 500 దీపం పథకం-2 లబ్ది
-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మంత్రి సత్య కుమార్ యాదవ్
-కట్టెల పొయ్యే ఉన్న ఇంటికి గ్యాస్ సిలిండర్ తెచ్చింది చంద్రబాబే
-రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ
-లబ్ధిదారులు సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నంబర్ “1967”ని ఫోన్ ఫోన్ చేస్తే పరిష్కరిస్తాం
-జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్

ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులైన లబ్ధిదారులకు అందజేయుచున్నామని, ఎలాంటి వివక్షతకు తావు లేకుండా అర్హులైన వారందరికీ పారదర్శకంగ సంక్షేమ ఫలాలు అందజేయుచున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం పట్టణంలోని హెచ్పి గ్యాస్ ఆవరణలో దీపం పథకం-2 లబ్ధిదారులకు మంత్రివర్యులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. జ్యోతి ప్రజలను కావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ చిలక0 మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, హెచ్.పీ గ్యాస్ డీలర్ గోవింద చౌదరి, ఆర్డీవో మహేష్, డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, అర్హులైన లబ్ధిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ
ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగమైన సూపర్ సిక్స్ లో   ప్రధానమైన దీపం పథకం-2 క్రింద నేడు లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ లను పంపిణీ చేస్తూ ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని మంత్రివర్యులు పేర్కొన్నారు.ఎన్నికల ముందు లబ్ధిదారులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నమన్నారు. ప్రభుత్వం సంవత్సరానికి ఇంకా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తుందని ముందుగా లబ్ధిదారులు సిలిండర్ కి అవసరమైన డబ్బును చెల్లిస్తారని, అనంతరం రెండు రోజుల్లో తిరిగి వారి ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు విధి విధానాలు వివిధ మాధ్యమాలు ద్వారా అధికారులు తెలియజేయడం జరిగిందన్నారు. అప్పు చేసి హామీలను నెరవేర్చే కంటే, సంపద సృష్టించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్థికపరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రజలు అండదండలు ఉండాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయుచున్నాడని తెలిపారు, ఉజ్వల, ప్రధానమంత్రి బీమా ఆవాస్ యోజన, స్టాండర్డ్, విశ్వకర్మ. మొదలైన సంక్షేమ పథకాలాన్ని అమలు చేయుచున్నాడని తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల నాలుగో తేదీన వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయుచుండదని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమం పటిష్టంగా అమలు చేయుచున్నామని తెలిపారు. ప్రతినెల వివిధ పింఛన్ కార్యక్రమాలలో సుమారు 33 వేల కోట్లు రూపాయలు ఖర్చుపెడుతున్నామని తెలిపారు.65 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.“DSc నోటిఫికేషన్ ద్వారా 16500 పోస్ట్లు భర్తీ చర్యలు చేపడుతున్నామని. పంచాయితీలు అభివృద్ధి చేయడానికి 4500 కోట్ల రూపాయలతో నరేగా నరేగా పనులు చేపడుతున్నామని, గ్రామాలలో స్మశాన వాటిక అభివృద్ధి చేయడానికి, ఎస్సీ ఎస్టీ కాలనీలలో రోడ్లు నిర్మించడానికి, దీపం 2 పథకం కింద ధర్మవరం నియోజకవర్గంలో 96500 కుటుంబాలు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా దీపం 2 పథకం కింద సుమారు 2500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో నిరుపేదలకు అందజేయుచున్నదని తెలిపారు, ఎన్డీఏ ప్రభుత్వం పేదల జీవితాలలో వెలుగులు నింపాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేయుచున్నదని తెలిపారు, ప్రతిపక్ష పార్టీ అంకుశంలా ఉండాలని తెలిపారు. రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ మాట్లాడుతూ
ఒకప్పుడు కట్టెల పొయ్యిలతో మహిళలు పడుతున్నఇబ్బందులు గమనించి.. పేదల ఇంటికి గ్యాస్ సిలిండర్లు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమం ధర్మవరంలో అట్టహాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం శుభపరిణామమని పేర్కొన్నారు
ఈ పథకం ద్వారా ఏడాదికి 2,684కోట్లు ఖర్చవుతోందన్నారు. ప్రస్తుతం గ్యాస్ ధర 876 రూపాయలు ఉండగా.. ఇందులో కేంద్రం 25రూపాయలు ఇస్తోందని.. 851 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. మీరు గ్యాస్ బుక్ చేసుకున్న 48గంటల్లో మీ అకౌంట్లోకి నేరుగా జమ అవుతుందని వివరించారు. కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ లబ్ధిదారులు దీపం పథకం- 2లో భాగంగా మొదటి ఉచిత సిలిండరు పొందుటకు 31 మార్చి 2025 తేది వరకు, రెండవ LPG వంటగ్యాస్ సిలిండరు 31 జూలై 2025, మూడోవ LPG వంటగ్యాస్ సిలిండరు 30నవంబరు 2025 తేది లోపు బుకింగ్ చేసుకుని గ్యాస్ సిలిండరు డెలివరి పొందుటకు సమయం ఉన్నదని, లబ్దిదారులు ఎవ్వరూ ఏవిధమైన ఆందోళనకు గురి కానవసరం లేదని, లబ్దిదారుని ఆధార్ నెంబరుతో అనుసంధానమైన గ్యాస్ కనెక్షన్ కార్డుకు వారి యొక్క EKYC నమోదు మరియు బ్యాంకు అక్కౌంట్ లింకు చేయబడాలని, గ్యాస్ సిలిండర్ పొందే సమయంలో లబ్దిదారులు గ్యాస్ కంపెనీ వారికీ గ్యాస్ ధర చెల్లించాలని, చెల్లించిన తదుపరి లబ్దిదారుకు 48 గంటలలోపు పనిదినాలలో ప్రభుత్వం నుండి సబ్సిడీ సొమ్ము బ్యాంకుఖాతాకు నేరుగా జమ అగునని, సబ్సిడీ చెల్లింపు గురించి ఆధార్ నంబర్కు లింకు అయిన లబ్దిదారుల మొబైల్ నంబర్కు SMS పంపబడుతుందన్నారు. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు ఉంటే, వాటి పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ “1967”ని ఫోన్ చేయడం ద్వారా మరియు PGRS(గ్రీవేన్సు) ద్వారా పరిష్కారం పొందవచ్చునని, ఈ అవకాశాన్ని లబ్దిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రమాదేవి, ఓబులమ్మ, సరస్వతి, లలిత లబ్ధిదారులకు సిలిండర్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల్ స్పెషల్ ఆఫీసర్ నాగరాజు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *