Breaking News

ఓటర్ల క్లైమ్స్ ని క్షేత్ర స్థాయిలో పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటున్న ఓటర్ల క్లైమ్స్ ని క్షేత్ర స్థాయిలో పరిశీలనకు బిఎల్ఓ లు ఆదివారం నుండి వస్తారని, దరఖాస్తుదార్లు బిఎల్ఓకి తమ చిరునామా, విద్యార్హత వంటి అవసరమైన పత్రాలు అందించి సహకరించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ గా అర్హత కల్గిన వారు ఆన్ లైన్ లో ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసారని, ఆయా దరఖాస్తులను క్షేత్ర స్థాయి పరిశీలనకు ఆదివారం నుండి బిఎల్ఓలు వస్తారని తెలిపారు. బిఎల్ఓలకు దరఖాస్తు చేసిన విధంగా తమ చదువు, చిరునామా, తదితర పత్రాలు అందించాలన్నారు. బిఎల్ఓలకు దరఖాస్తు మేరకు సమగ్ర వివరాలు అందించకుంటే సదరు దరఖాస్తు రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా సమగ్ర వివరాలు ఇవ్వాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *