చింతా గిరి ప్రజా హృదయాలలో చిరస్మరణీయుడు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మీరెంతో అమితంగా అభిమానించి ఓట్లేసి గెలిపించిన దివంగత కార్పొరేటర్ స్థలాల పంపిణీ ద్వారా చింతా గిరి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడయ్యారని ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే సమయానికి గిరి మన మధ్య బౌతికంగా లేకపోవడం ఎంతో బాధాకరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 32 వ డివిజన్ లో కాపు కళ్యాణ మండపంలో జరిగిన దివంగత కార్పొరేటర్ చింతా గిరి జన్మదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. చింతా గిరి ధర్మపత్ని చింతా మౌనిక ఆమె ఇద్దరు ఆడపిల్లలు తొలుత దివంగత చింతా గిరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 32 వ డివిజన్ లో అర్హత కల్గిన 361 మంది లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పుట్టింట్లో అత్తింట్లో ఆరుపదుల వయస్సు వచ్చినా అద్దె ఇంట్లో ఇప్పటివరకు బతుకు భారంగా ఈడ్చే వారెందరో మన రాష్ట్రంలో ఉన్నారన్నారు. అటువంటివారిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పేదవారికి ఇళ్ల స్థలాల ఇచ్చే విషయంలో ఎంతో చిత్తశుద్ధి ప్రదర్శించారని స్వంతంగా సెంటు స్థలం పట్టాతో అప్పగించడమే కాక గృహ నిర్మాణానికి లక్షా 80 వేల రూపాయలను ఇవ్వాలని సంకల్పించారని తెలిపారు. 32 వ డివిజన్ లో 361 మందికి ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి అలాగే 11 మందికి అపార్టుమెంట్లకు డబ్బులు గత ప్రభుత్వంలో చెల్లించేమని అవే మాకు కావాలని అంటున్నారని చెప్పారు. ఎన్నికల ముందు పాత ప్రభుత్వం మచిలీపట్నం మునిసిపాలిటీ మొత్తం మీద 4, 176 మంది వద్ద ఇళ్లస్థలాలకు అర్జీలు తీసుకొన్నారని అలాగే జి ప్లస్ 3 అపార్ట్మెంట్ ప్లాట్ల కోసం రకరకాల పద్ధతిలో డబ్బులు కట్టించుకొన్నారన్నారు. కొందరి వద్ద 12, 500 రూపాయలు , కొందరి వద్ద 25 వేలు , మరికొందరు వద్ద 50 వేలు, ఇంకొందరు వద్ద లక్ష రూపాయలు చొప్పున న న కట్టించుకొన్నారన్నారు. వీటిలో భవనం ఏదో దశలో పూర్తి చేసినవి 2, 308 అపార్ట్మెంట్లలో ఏదో ఒక పని మొదలు పెట్టినవేనన్నారు. వీరిలో 1832 మందికి డబ్బులు కట్టించుకోలేదు ఇళ్ళు మొదలుపెట్టలేదని తెలిపారు. 300, 365, 430 చదరపు అడుగుల స్థలాలకు లబ్ధిదారులు 500 , 50 వేలు, లక్ష రూపాయలు అడ్వాన్స్ గా కట్టినవారు ప్రతినెల 2 వేల రూపాయలు చొప్పున 20 సంవత్సరాలు అపార్ట్మెంట్ కోసం చెల్లించాలని అన్నారు. అద్దె ఇంట్లో ఉండిన లబ్ధిదారుడు మరల ప్రతి నెల అద్దె మాదిరిగా ఎందుకు కట్టాలి.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆ విధమైన వ్యాపార విధానాలకు వ్యతిరేకమని అన్నారు. లబ్ధిదారుల వద్ద కొంత డబ్బు తీసుకొని వారి పేరు మీద రుణం తీసుకోని అపార్ట్మెంట్ ను బ్యాంకు లో తనఖా పెట్టి ప్రతి నెల రెండు వేల రూపాయల చొప్పున కిస్తీ కట్టించుకోవాలనేది గత ప్రభుత్వ విధానమని కానీ , జగన్మోహనరెడ్డి ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం తిరిగి చెల్లించనవసరంలేని లక్షా 80 వేల రూపాయల డబ్బును ప్రతి లబ్ధిదారునికి ఇవ్వడం ఈ ప్రభుత్వ విధానమని మంత్రి చెప్పారు, అలాగే అపాట్మెంట్ల కోసం చెల్లించిన డబ్బులను వెనక్కి తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమని వివరించారు. భూమి కొనుగోలు ఆలస్యం కావడం చేతనే ఇళ్లపట్టాల పంపిణీ ఆలస్యమైందన్నారు. భూమిని మెరక చేసి లే అవుట్ సిద్ధం చేసి ఫ్లాట్ నంబర్లు సిద్ధం అవుతున్నాయన్నారు. అలాగే నూతనంగా ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ అర్జీలు పెట్టుకొన్న 90 రోజులలో అర్హత గలవారికి మరల ఇళ్లస్థలాలు వెంటనే మంజూరు కాబడతాయని మంత్రి తెలిపారు. తన డివిజన్ ప్రజలకు అందుబాటు చోటులోనే స్ధలాలు ఇవ్వాలని చింతా గిరి పదే పదే తనను కోరేవాడని , ఇంతమందికి స్థలాలు ఇవ్వడం చూసే అదృష్టం ఆయనకు దక్కక పోవడం ఎంతో దురదృష్టకరమని, అన్నయ్య నేను ప్రజాసేవ చేస్తానని తనను ఎంతో అభిమానంగా వెంబడించే చింతా గిరి కుటుంబానికి తాను జీవించిన కాలమంతా అండగా ఉంటానని మంత్రి పేర్ని నాని గద్గద స్వరంతో సభాముఖంగా హామీ ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, మునిసిపల్ కమీషనర్ శివరామకృష్ణ, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, తహశీల్ధార్ సునీల్ బాబు, 32 వ డివిజన్ ఇంచార్జ్ చింతా మౌనిక, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు లంకా సూరిబాబు, చిటికెన నాగేశ్వరావు, జోగి చిరంజీవి, అస్గర్ ఆలీ, బందెల థామస్ నోబుల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *