Breaking News

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి వారు రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్  నారపు రెడ్డి మౌర్య, జెసి శుభం బన్సల్, టీటీడీ సిఈ సత్యనారాయణ తదితర అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షిస్తూ అవిలాల చెరువును ఎన్జిటి నిబంధనలకు లోబడి అభివృద్ధి చేయుట కొరకు ఒక కమిటీని టీటీడీ సిఈ, ఇరిగేషన్ ఈఈ, పిడి ఎన్హెచ్, ఆర్డీఓ తిరుపతి, తుడా సెక్రెటరీ లతో ఏర్పాటు చేసి రెండు వారాల్లో నివేదికను సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో తుడా సెక్రెటరీ డా. వెంకట నారాయణ, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణ్ రెడ్డి, ఆర్డీఓ తిరుపతి రామ్మోహన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *