Breaking News

గ్యాస్ డెలివరీ బాయ్స్ చే ఈ కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ఉచిత గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు వారి ఇంటి వద్దే గ్యాస్ డెలివరీ బాయ్స్ చే ఈ కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సంవత్సరానికి [3] గ్యాస్ సిలిండర్లు ఉచితముగా పంపిణీ చేసే పథకాన్ని అక్టోబర్ 31నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 55 గ్యాస్ ఏజెన్సీ లలో ఉచిత సిలిండర్ల బుకింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు.ఈ పథకానికి బియ్యం కార్డు, గ్యాస్ కనెక్షన్, అధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు అర్హులన్నారు. వినియోగదారులు తమ మొదటి ఉచిత సిలిండర్ ను వారికి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీలలో 2025, మార్చి 31 వ తేదీ లోపు బుక్ చేసుకొనవచ్చునన్నారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటలలో గ్యాస్ వినియోగ దారుని ఆధార్ నంబరు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లో నేరుగా గ్యాస్ సిలిండర్ ధర మొత్తం జమ చేయుట జరుగుతుందన్నారు. అదేవిధముగా ఈ కేవైసీ చేయించుకొనని గ్యాస్ వినియోగదారులకు వారి ఇంటి వద్దనే గ్యాస్ డెలివరీ బాయ్స్ చే ఈ కేవైసీ తీసుకొనుటకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గ్యాస్ వినియోగదారులు దీనిపై ఏమైనా పిర్యాదులు వుంటే 1967 టోల్ ఫ్రీ నెంబరును కాని, దగ్గరలోని సచివాలయంలో గాని సంప్రదించవచ్చునన్నారు. జిల్లాలోని అర్హులైన గ్యాస్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా ఆ ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *