-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
-తొండవాడ లేఔట్ లోని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు త్వరితగతిన పూర్తిస్థాయి ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలి : జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్
-తొండవాడ లేఅవుట్ లోని సమస్యలన్నీ త్వరితగతన పూర్తికి చర్యలు : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
-ప్రజా సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి…. ఇది మంచి ప్రభుత్వం : పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రగిరి నియోజక వర్గంలోని తొండవాడ లేఔట్ లోని మౌలిక వసతుల పరిష్కారానికి గృహ నిర్మాణ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
శనివారం సాయంత్రం చంద్రగిరి నియోజకవర్గంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, గృహ నిర్మాణ శాఖ అధికారులతో తొండవాడ లేఔట్ లోని మౌలిక వసతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ… తొండవాడ లేఅవుట్లో కావలసిన, విద్యుత్, తాగునీరు, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల ను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని, లేఔట్ లోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల వారి ఇళ్ళ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. లేఅవుట్ లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. కనీస మౌలిక వసతులు అయిన విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను కాలనీవాసులు మంత్రి దృష్టికి తీసుకుని రావడం జరిగింది, అనంతరం మంత్రి లేఅవుట్ సమస్యల పరిష్కారానికి గృహనిర్మాణశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. చంద్రగిరి ఎమ్మెల్యే లేఔట్ సమస్య నా దృష్టికి తీసుకొని వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి లేఔట్ ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెడుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. తొండ వాడ లేఅవుట్ లోని త్రాగునీరు, విద్యుత్, రోడ్డు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు త్వరగా పూర్తిచేసి పూర్తిస్థాయి ఇళ్ళ నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని తెలిపారు.
చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొండవాడ లేఔట్ లోని సమస్యలను ఆరు నెలల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్నానని తెలిపారు. పూర్తిస్థాయిలో లేఔట్ లో అభివృద్ధి పరచడానికి కొంత సమయం పడుతుందని తొందరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
పూతల పట్టు ఎంఎల్ఏ మాట్లాడుతూ.. చంద్రగిరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నాని ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే లేఔట్ లోని విద్యుత్ త్రాగునీరు రోడ్డు నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి లేఔట్ ను సుందరమైన లేఅవుట్లగా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము జవాబు దారీగా, సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తోందని ఇది మంచి ప్రభుత్వం అని తెలిపారు. ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్లను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం లేఔట్లలో కనీస సౌకర్యాలు లేవని, సదుపాయాలు పూర్తి అయ్యేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ జీవీ ప్రసాద్ ఎస్ఈ నాగభూషణ్, తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్, హౌసింగ్ అధికారులు శ్రీనివాసరావు పద్మనాభం, తాసిల్దార్ లు హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News