Breaking News

ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానిపురం పి ఆర్ కే బిల్డింగ్ వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం వైభవంగా సాగింది. ఏలూరు సాయి శరత్, తడికమళ్ళ ఆదిత్య స్వాముల బృందం ఏర్పాటుచేసిన అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో శనివారం మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పడిపూజ కార్యక్రమంలో మాల ధరించిన భక్తులు కర్పూర హారతులు వెలిగించి పూజలు చేశారు. అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో తెల్లనా గుల రాకేష్, అడపా హరీష్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *