Breaking News

ఓర్వ‌క‌ల్ లో డ్రోన్ హ‌బ్‌కు 300 ఎక‌రాలు

-స్థ‌లాల‌ను ప‌రిశీలించి డ్రోన్ కార్పొరేష‌న్ సీఎండీ కె. దినేష్ కుమార్‌
-స్థ‌ల సేక‌ర‌ణ త్వ‌ర‌తిగ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశం
-జిల్లా ఆర్టీజీఎస్ , పైబ‌ర్ నెట్ జిల్లా కేంద్రాలూ ప‌రిశీల‌న‌

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లులో 300 ఎక‌రాల స్థంలో డ్రోన్ హ‌బ్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఓర్వ‌క‌ల్లు ప్రాంతాన్ని డ్రోన్ హ‌బ్ గా అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో ఈ హ‌బ్ ఏర్పాటుకు సంబంధించిన స్థ‌లాల‌ను దినేష్ కుమార్ శ‌నివారం ప‌రిశీలించారు. ఓర్వ‌క‌ల్లు, పాల‌కొల‌ను, కోమ‌రోలు, చింత‌ప‌ల్లె, సోమ‌యాజుల‌ప‌ల్లోలో డ్రోన్ హ‌బ్ ఏర్పాటుకు అనువైన భూముల‌ను స్థానిక రెవెన్యూ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న డ్రోన్ హ‌బ్ స్థ‌లాల సేక‌ర‌ణ గురించి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. చింత‌ల‌ప‌ల్లె గ్రామం వ‌ద్ద పాల‌కొల‌ను, మ‌రియు కొమ‌రోలు వ‌ద్ద కొన్ని భూములు డ్రోన్ హ‌బ్ ఏర్పాటుకు అనువైన స్థ‌లాలున్నాయ‌ని వివ‌రించారు. ఆ స్థ‌లాల‌ను కూడా డ్రోన్ కార్పొరేష‌న్ సీఎండీ ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న అధికారుల‌తో మాట్లాడుతూ ఓర్వ‌క‌ల్లును డ్రోన్ హ‌బ్‌గా ఏర్పాటు చేయాల‌ని సీఎం ఎంతో దృఢ నిశ్చ‌య్యంతో ఉన్నార‌ని, ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్ఠాత్మ‌కంగా తీసుకుంటోంద‌ని చెప్పారు. ఈ డ్రోన్ హ‌బ్ ఏర్పాటు వ‌ల్ల ఇక్క‌డ ఎంతో మందికి ఉపాధి ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయ‌ని, ఈ హ‌బ్ ఏర్పాటుకు కావాల్సిన భూముల సేక‌ర‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌తివ్వాల‌ని సూచించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా భూముల‌ను గురించి ఈ స్థ‌ల సేక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. స్థ‌ల సేక‌ర‌ణ‌, అనువైన స్థ‌లాల గుర్తింపులో రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని సూచించారు. భూములు గుర్తింపు ఒక‌సారి పూర్తి చేస్తే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ‌తామ‌ని, సీఎం సూచ‌న‌ల‌తో ఈ ప్రాజెక్టు ఈ భూముల్లో ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేదానిపైన ఒక తుది నిర్ణ‌యం తీసుకుంటార‌న్నారు. స్థ‌ల సేక‌ర‌ణ ప‌నుల్లో ఎలాంటి అల‌స‌త్వం లేకుబ‌డా అధికారులు ప‌ని చేయాల‌ని సూచించారు. ఓర్వ‌క‌ల్ ఆర్డీఓ సందీప్ కుమార్; ఏపీఐఐసీ జోన‌ల్ మేనేర్‌, మండ‌ల తహ‌సీల్దార్ విద్యాసాగ‌ర్‌లు ఆ ప్రాంతంలో భూముల ల‌భ్య‌త గురించి డ్రోన్ కార్పొరేష‌న్ సీఎండీకి వివ‌రించారు.

జిల్లా ఆర్టీజీఎస్ కేంద్రం ప‌రిశీల‌న‌
క‌ర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రిల‌య్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ జిల్లా సెంట‌ర్ నిర్మాణ ప‌నుల‌ను ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ప‌రిశీలించారు. క‌ర్నాలు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న జిల్లా క‌లెక్టరేట్‌లో చేప‌డుతున్న ఆర్టీజీఎస్ నిర్మాణ ప‌నులు ఎంత మాత్రం జ‌రుగ‌తున్నాయ‌నేదాని గురించి అక్క‌డి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఆర్టీజీఎస్ కేంద్రాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. ప్ర‌భుత్వం ప్ర‌తి జిల్లాలోనూ క‌లెక్ట‌రేట్‌కు అనుసంధానంగా ఒక ప్ర‌త్యేక ఆర్టీజీఎస్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంద‌ని తద్వారా ఆయా జిల్లాలో ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు, ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్‌ను రియ‌ల్ టైమ్‌లో ప‌రిశీలించి, స‌మీక్షించే వీలు క‌లుతుతుంద‌న్నారు. ఈ కేంద్రా నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌తిచ్చి నిర్ణీత గ‌డువులోపు వీటి నిర్మాన‌ల‌ను పూర్తి చేయాల‌న్నారు.

పైబ‌ర్‌నెట్ కేంద్రం ప‌రిశీల‌న‌
క‌ర్నూలు జిల్లాలోని పైబ‌ర్ నెట్ కేంద్రాన్ని కూడా ఏపీ పైబ‌ర్ నెట్ సీఎండీ హోదాలో దినేష్ కుయ‌మార్ ప‌రిశీలించారు. క‌ర్నూలు జిల్లాలో పైబ‌ర్ నెట్ విస్త‌ర‌ణ ప‌నుల‌ను అక్క‌డి అధికారుల‌తో ఆయ‌న స‌మీక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *