తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అటవీ భూములు అక్రమించుకోవడం చట్టరీత్యా నేరమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వి సి హాల్ నందు ఆదవరం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని ఆక్రమణ కు గురైన అటవీ భూములు పై కే వి బి పురం మండలం కలత్తూరు గ్రామ రైతులతో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ , డి ఎఫ్ ఓ , సబ్ డి ఎఫ్ ఓ, ఆర్, డి ఓ శ్రీకాళ హస్తి, పుత్తూరు డి ఎస్ పి, అగ్రికల్చరల్ అధికారులతో, కే వి బి పురం తహశీల్దారు మరియు కలత్తూరు గ్రామ రైతులు, నాయకులు తో అటవీ, రెవెన్యు భూముల ఆక్రమణలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలత్తూరు భూఆక్రమణలకు సంబంధించి అటవీ ప్రాంత భూములందు వ్యవసాయం చేయడం చట్ట రీత్యా నేరం అని తెలుపుతూ గతంలో రెవిన్యూ భూముల్లో వ్యవసాయం చేసుకునే వారు గతంలో వారికి డి కే టి పట్టాలు ఇవ్వడం జరిగిందని అందులో వ్యవసాయం చేసుకుంటే ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. కలత్తూరు గ్రామ రైతులు అటవీ ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల లో పంటలు వేసారని మా దృష్టికి వచ్చిందని కాని రైతులు నష్ట పోకూడనే ఉద్దేశ్యంతో వేసిన ఒక పంటను సాగు చేసుకోవడానికి మాత్రమె అనుమతినిస్తున్నామని ఈ అటవీ ప్రాంత భూములలో కలత్తూరు గ్రామ రైతులు తిరిగి ఎటువంటి పంటలు వేయరాదని తెలిపారు. ప్రభుత్వ రెవిన్యూ, అటవీ భూములలో వ్యవసాయం చేయాలనీ చూస్తే ఎంతటి వారైనా కటిన చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్నామని రైతులు తెలుపగా అందులకు మీరు అక్కడే మూడు తరాల నుండి వ్యసాయం చేస్తున్నామని రుజువులు చూపాలని లేదా సంబందిత రైతులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ క్రింద దరఖాస్తులు సమర్పిస్తే పరిశీలిస్తామని తెలిపారు. వీటిపై సంబందిత నివేదికలను తాయారు చేసి ప్రభుత్వానికి పంపుటకు తగు చర్యలు తీసుకొనుటకు సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంబందిత అధికారులు , కలత్తూరు రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News