-ఆర్ట్ కళాశాలలో రిసీప్షన్ కేంద్రం పరిశీలన
-జిల్లా వ్యాప్తంగా 20 పోలింగు కేంద్రాలు ఏర్పాటు
-డిసెంబర్ 4 వ తేదీ పోలింగు మెటీరియల్ పంపిణీ
-సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా జిల్లా రెవిన్యూ అధికారి నియామకం
-డిసెంబర్ 5 వ తేది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ పోలింగు
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని పోలింగు కేంద్రాల కు మెటీరియల్ తరలించేందుకు నగరంలో అర్ట్స్ కళాశాలలో రిసీప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. మంగళవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల, ఎస్ కె వి టి డిగ్రీ కళాశాల ను డి ఆర్ వో, ఆర్ డి వో లతో కలిసి కలెక్టర్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, జిల్లా పరిధిలో మొత్తం 20 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చెయ్యగా : ప్రతి మండలం ఒక్కొక్కటి చొప్పున, రాజమహేంద్రవరం అర్బన్ పరిథిలో రెండు పోలింగు కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్, ఎన్నికల సిబ్బంది స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి డిసెంబర్ 4 వ తేదీన బయలుదేరి వారికీ కేటాయించిన పొలింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రతి పోలింగ్ స్టేషన్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. కలెక్టరు వెంట డిఆర్వో టి. శ్రీరామచంద్రమూర్తి, ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ , ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర రావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News