విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడి గా ఇటీవల నియమితులైన సీనియర్ నాయకులు జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి)ని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడిగడపలోని సుజనా చౌదరి ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో ఇటీవల జనసేన లో చేరిన నేతలతో ఉదయభాను సుజన చౌదరి ను కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి కి అండగా నిలబడిన జనసేన నేతలకి సుజనా చౌదరి శుభాకాంక్షలు తెలిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జనసేన ఆంధ్రజోన్ కన్వీనర్ భాడిత శంకర్, మరుపిళ్ళ రాజేష్, మహదేవు అప్పాజీరావు, అత్తులూరి పెదబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News