Breaking News

భూ సేకరణ పనులను వేగవంతం చేయండి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నేషనల్ హైవే పి డి లు, రైల్వే శాఖ ఈ, ఈ, ఏ ఈ లు, తాసిల్దార్ ల తో భూ సేకరణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై జాతీయ రహదారి, రైల్వే శాఖ మరియు రెవెన్యూ సంబంధించి జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని, ఆలసత్యం ఉండరాదని తెలిపారు. జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉండాలని తెలిపారు. కాలూరు- పీలేరు, రేణిగుంట -నాయుడుపేట గూడూరు, సూళ్లూరుపేటకు సంబంధించిన సాగరమాల రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. భూ సేకరణ విషయంలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని, ముఖ్యంగా రహదారుల నిర్మాణంలో ఎటువంటి జాప్యము లేకుండా పనులు పూర్తి కావాలని తెలిపారు. రెవెన్యూ డివిజన్ అధికారులు ఎప్పటికప్పుడు ఎన్ హెచ్ అధికారులతో సమన్వయం చేసుకొని రహదారుల పనులు పురోగతిలో ఉండేలా చూడాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *