గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. నామినేషన్ల దాఖలులో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వెంటనే జిల్లా కలెక్టర్ లేదా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా, ఇతర సమస్యల వల్ల నామినేషన్లు సమర్పించలేకపోయినా పోలీసులను సంప్రదించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం 8688831390, డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించవచ్చని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
