-247 మందికి వైద్య పరీక్షలు.. అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దీపక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పి. సురేష్ కుమార్ తెలిపారు. డాక్టర్ ఎం.వి. మధుసూదన్ రావు పర్యవేక్షణలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 247 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
శిబిరంలో సాధారణ వైద్య సంప్రదింపులతో పాటు రక్తపోటు, మధుమేహం, కంటి పరీక్షలు, వినికిడి పరీక్షలు, గుండెకు సంబంధించిన ఈసీజీ, ఎకో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే శిబిరంలో పాల్గొన్న వారికి రక్త పరీక్షలపై 50 శాతం, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్రే పరీక్షలపై 20 శాతం రాయితీ కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
