వెంకటపాలెంలో అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న దేవినేని ఉమా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పాటిబండ్ల జగదీష్ గారి స్వగృహంలో భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పూజ మహోత్సవంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. పవిత్రమైన 18 మెట్లకు విశేష పూజలు, హరిహరసుతుడైన మణికంఠునికి భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహించారు. శరణుఘోషలు, భజనలు, స్వామివారి నామస్మరణతో ఆ ప్రాంతమంతా భక్తిమయంగా మారింది. అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సకల శుభాలు కలగాలని దేవినేని ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు.