Andhra Pradesh

హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు – కమిషనర్ పి.రంజిత్ భాషా

-వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ బుధవారం అధికారులతో కలసి డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ యొక్క నిర్వహణ విధానమును మరియు నగర పరిధిలోని వివిధ రిజర్వాయర్లకు రక్షిత నీటి సరఫర విధానముపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. రాబోవు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వేసవిలో నాచు శాతం …

Read More »

బాకాలు ఊదడం, భజన చేయడం టీడీపీ పేటెంట్ రైట్స్

-జయము జయము చంద్రన్న.. పాట ప్రమోషన్ కు రూ. కోట్లు ఖర్చు చేసిన సంగతి మరిచారా..? -బీసీ మహిళ అని చూడకుండా సభలో మేయర్ ఛైర్ ను అవమానించారు -పేపర్లు చింపి అరుపులు కేకలతో ప్రజా బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా గందరగోళం సృష్టించారు -టీడీపీ ఫ్లోర్ లీడర్ల తీరుపై నిప్పులు చెరిగిన వైసీపీ నాయకులు పిల్లి కృష్ణవేణి, కుక్కల అనిత, కొండాయిగుంట మల్లీశ్వరి, ఉద్ధంటి సునీత, కొంగితల లక్ష్మీపతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాకాలు ఊదడం, భజన చేయడం తెలుగుదేశం పార్టీ …

Read More »

పేదలందరికీ సొంత గూడు ఉండాలనేదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా క్రమబద్ధీకరణ చేసిన ఇంటి స్థల పత్రాల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేదలందరికీ సర్వ హక్కులతో కూడిన ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఉండాలనేదే సీఎం వైఎస్ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో పలువురు గిరిపురం వాసులకు జీవో నెం.463 ద్వారా క్రమబద్దీకరణ చేసిన ఇంటి స్థల పత్రాలను బుధవారం ఆయన అందజేశారు. ఎంతోకాలంగా పేద ప్రజలు నివసిస్తున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేయడం ద్వారా …

Read More »

నిరుపేదలకు అండగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలు నుండి ట్రస్టు తరఫున అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ,ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ‌ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గలోని 15వ డివిజన్లో అపడవలరేవు సెంటర్ లో దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ ద్వారా ఐదుగురు నిరుపేద కుటుంబాలకి “లక్షల 20రూపాయల” …

Read More »

50లక్షల రూపాయల నిధులతో క్రిస్టియన్ శ్మశానవాటిక ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో 14 పేటల క్రిస్టియన్ లకు ఉపయోగపడేలా 50లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో క్రైస్తవ స్మశానవాటిక ను నిర్మించడం జరిగిందని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని రామలింగేశ్వర నగర్ నందు జరిగిన క్రైస్తవ శ్మశాన వాటికను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ లు బెల్లం దుర్గ, అవుతూ శైలజ రెడ్డి లతో కలిసి అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ క్రైస్తవ …

Read More »

దక్షిణ మధ్య రైల్వేలో మొదటి గతి`శక్తి మల్టీ మోడల్‌ కార్గో టెర్మినల్‌ ప్రారంభం

-దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నక్కనదొద్డి స్టేషన్‌ వద్ద మెస్సర్స్‌ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మొదటి గతి-శక్తి మల్టీ మోడల్‌ కార్గో టెర్మినల్‌గా గుర్తింపు పొందింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే కార్గో నిర్వహణలో అదనంగా టెర్మినళ్లను అభివృద్ధి చేయడంలో పరిశ్రమల నుండి పెట్టుబడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే వారిచే నూతన గతి-శక్తి మల్టీ మోడల్‌ కార్గో టెర్మినల్‌ (జిసిటి) విధానం ప్రవేశపెట్టబడిరది. సరుకులను భద్రంగా మరియు సురక్షితంగా రైళ్లలో రవాణా చేయడానికి రైల్వే శాఖ వారిచే …

Read More »

కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ వేదికగా మంగళవారం ప్రముఖ ఒడిశా కవి, ఒడిస్సా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ భగవన్ జయసింగ్ “టికీ అటకిజా-ఏ, పంత్ (కొంచెం వేచి ఉండండి, ఓ ట్రావెలర్) పేరిట రచించిన 8వ ఒడియా కవితల సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీవన గమనంలో ఓ ప్రయాణికుడిగా మృత్యువును ఆలింగనం చేసుకునే క్షణాన, దుఃఖాలు, వేదనలతో నిండిన సమకాలీన వాస్తవికతలో భాగంగా గత జ్ఞాపకాలను పునశ్చరణ చేసే కథానాయకుడి …

Read More »

కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర వస్తువులు, వంట నూనెలను అనధికార నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. నందిగామ, ఏ.కొండూరు, తిరువూరు,విజయవాడ నగరంలోని పలు దుకాణాల్లో మంగళవారం పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు టి.కనకరాజు ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని దుకాణాల …

Read More »

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఏర్పాటు కానున్న ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు కలెక్టర్‌ కార్యాలయం, అనుబంధం వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌, మీనీమీటింగ్‌ హాల్‌, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయం, జాయింట్‌ కలెక్టర్ల కార్యాలయాల నిర్మాణాలకు జరుగుతున్న పనులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ పరిశీలించారు. ప్రస్తుతం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ భవనాలలో అందుబాటులో ఉన్న వివిధ గదులలో నూతన కలెక్టర్‌ కార్యాలయానికి అనువుగా మార్పులు చేసేందుకు చేపడుతున్న నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి …

Read More »

వంట నూనెలను వినియోగదారులకు అందుబాటు ధరలలో లభించేలా రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వంట నూనెలను వినియోగదారులకు అందుబాటు ధరలలో లభించేలా రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డా.కె మాధవీలత అన్నారు. బహిరంగ మార్కెట్లలో వంట నూనెలు అధిక ధరలో విక్రయిస్తున్నారని వినియోగదార్ల నుంచి పిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వంట నూనెల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా జిల్లాలోని 42 రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లలో వంట నూనెలను సరసమైన ధరలకు విక్రయిస్తునట్లు జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. నగరంలోని …

Read More »