విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని విద్యావిధానంలో సమూల మార్పులకు నాంది పలికినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందని, అందులో భాగంగా నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూములతో విద్యార్ధులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ అధ్వర్యంలో జగనన్న విద్యాకానుక రెండో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం కొత్తపేట తేలప్రోలు రాజా హై స్కూల్ …
Read More »Andhra Pradesh
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించండి…
– ప్రతి నెలా వేర్వేరు పథకాలను అమలు చేస్తున్నాం… – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, ఆగస్టు 21: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కొడాలి నాని గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. …
Read More »కల్వపూడి అగ్రహారం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని
– సర్పంచ్, ఎండీవోతో కలిసి శిలాఫలకం ఆవిష్కరణ… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శనివారం ప్రారంభించారు. గుడివాడ ఎండీవో ఏ వెంకటరమణ, గ్రామ సర్పంచ్ పోటూరి వెంకటేశ్వరమ్మ, గ్రామ పెద్దలతో కలిసి మంత్రి కొడాలి నాని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని పూజా కార్యక్రమాలను …
Read More »మన సంస్కృతి, వారసత్వం గురించి యువత తెలుసుకోవాలి : ఉపరాష్ట్రపతి
-తద్వారా మనోబలం, ఆత్మవిశ్వాసం పెరిగి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కాగలరు -మన చరిత్ర, సంప్రదాయాల గురించి వారికి తెలియజేసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి -కుటుంబ సమేతంగా చారిత్రక హంపి నగరాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి -పురావస్తు శాఖ వారు హంపిని సంరక్షిస్తున్న తీరు పట్ల సంతృప్తి హంపి, నేటి పత్రిక ప్రజావార్త : ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం నాడు కుటుంబ …
Read More »సహాయక చర్యలను పర్యవేక్షించిన అవినాష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని APIIC కాలనీ నందు శనివారం భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం 4వ డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకువెళ్లగా హుటాహుటిన సంబంధిత అధికారులతో కలిసి వెంటనే ఆ ప్రాంతంలో పర్యటించిన అవినాష్ బొరేవెల్ సిస్టమ్ , జెట్ మోటర్లు ఏర్పాటు చేసి నీటిని తోడే చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా …
Read More »శ్రీ భూ వరాహ స్వామివారికి మహాలక్ష్మీ అమ్మవారి ఉత్సవమూర్తికి తిరుమంజనసేవ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూ వరాహ స్వామివారికి అలానే మహాలక్ష్మీ అమ్మవారి ఉత్సవమూర్తికి ఉదయం తిరుమంజనసేవ జరిగినది. విశేషించి శ్రావణ మాసం లో రెండవ శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్తం హవనం ఎంతో వైభవంగా జరిగినది. ఈ విశేష కార్యక్రమం లో భక్తులు పాల్గొని, ఇందులో భాగస్వాములై ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందారు.
Read More »వైఎస్ఆర్ జగనన్నకాలనీ ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే విధంగా మౌలికసదుపాయాలను సిద్దం చెయ్యాలి…
-సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు నిర్మాణంలో భాగంగా లబ్దిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో మెరక పనులను పూర్తి చేసి ఇళ్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అధికారును ఆదేశించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఇళ్ల స్థలాలు, వీటీపీఎస్ ల్యాండ్ ఇన్సపెక్షన్, నవేపోపవరంలో ప్రైవేట్ మరియు పారెస్టు ల్యాండ్స్ ను సబ్ …
Read More »మీ సమస్యలు న్యాయం అయినవి…
-మా సహకారం ఎప్పుడూ ఉంటుంది… -అధికారపక్షానికి లేఖ రాస్తా… -ప్రాంతీయ పత్రిక ఎడిటర్ కు అండగా ఉంటా… -స్థానిక పత్రికలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది… -ఏపీ ఎస్ఎస్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా క్షేత్రంలో నిత్యం తిరుగుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి చేరవేస్తూ వారధిగా ఉన్న జర్నలిస్టులకు,స్దానిక పఁతికల ఎడిటర్లకు అఁకిడేషన్ ఇవ్వకపోవడం , జిఎస్టి విధించడం అన్యాయమని ప్రాంతీయ పత్రికల ను ఆదుకోవాల్సిన …
Read More »ప్రతి గ్రామంలో సుపరిపాలన అందించడమే సియం. జగన్ ధ్యేయం : ఎమ్మేల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, ఆగష్టు, 20 : ప్రజా సంక్షేమ పాలనను పేద ప్రజల వద్దకు తీసుకువచ్చి సుపరిపాలన అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తపన అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సంక్షేమ పాలనను తీసుకు …
Read More »రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పనితీరుకు పోలీస్ శాఖ సాధించిన పతకాలే నిదర్శనం…
-పోలీస్ క్వార్టర్స్, పోలీస్ భవనాల నిర్మాణంతో పాటు గతంలో నిర్మించిన భవనాల అభివృద్ధి… -రాష్ట్ర హోంశాఖామాత్యులు మేకతోటి సుచరిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం నిరంతరం సేవలు అందిస్తున్నదని ఇందుకు పోలీస్ శాఖ సాధించిన పతకాలే నిదర్శనమని రాష్ట్ర హోం శాఖామాత్యులు శ్రీమతి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమితులైన మెట్టుకూరు చిరంజీవ రెడ్డి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో హోమ్ శాఖామాత్యులు …
Read More »