-సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు నిర్మాణంలో భాగంగా లబ్దిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో మెరక పనులను పూర్తి చేసి ఇళ్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అధికారును ఆదేశించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఇళ్ల స్థలాలు, వీటీపీఎస్ ల్యాండ్ ఇన్సపెక్షన్, నవేపోపవరంలో ప్రైవేట్ మరియు పారెస్టు ల్యాండ్స్ ను సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మిస్తుందని, వైఎస్ఆర్ జగనన్నకాలనీల్లో ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే విధంగా మౌలికసదుపాయాలను సిద్దం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా కొండపల్లిలో లబ్దిదారులకు అందించిన జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించారు. కొండపల్లి వీటీపీఎస్ పవర్ స్టేషన్ కు సంబందించి పర్మిషన్ కొరకు ధరఖాస్తు చేసిన భూమిని పరిశీలించారు. అనంతరం నవేపోతవరం లో రీ సర్వేలో భాగంగా ప్రైవేట్, ఫారెస్టు భూములకు సంబందించి ఫారెస్టు అధికారులు, సర్వేయర్లుతో కలసి భూములను పరిశీలించారు. సబ్ కలెక్టరు వెంట ఇబ్రహీం పట్నం తాహశీల్థారు, సూర్యారావు, ఫారెస్టు రేంజ్ ఆఫీసరు లెనిన్ మండల సర్వేయర్లు, ఆర్.ఐ.లు తదితరులు ఉన్నారు.