-హెచ్ఈపీసీ అధికారులతో ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి భేటీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్న చేనేత వస్త్రాలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు గల అవకాశాలపై ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, అధికారులు బుధవారం చెన్నైలో కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (హెచ్ఈపీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్న చేనేత వస్త్రాలకు దేశ, విదేశాల్లో …
Read More »Andhra Pradesh
గొడవర్రు గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచడంతోపాటు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలను పోస్టర్ల ద్వారా తెలియజేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామ సచివాలయాన్ని బుధవారం సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలను సచివాలయ సిబ్బంది అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రజలకు …
Read More »ఇళ్ల లేఅవుట్ లెవెలింగ్ పనులను యుద్ధ ప్రాతిపదిక పై పూర్తి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలోని ఇళ్ల లేఅవుట్ ను బుధవారం విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్యసాయిప్రవీణ్ చంద్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గొడవర్రు గ్రామంలో 82.89 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 4820 మంది లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు అందించడం జరిగిందన్నారు. ఈమేరకు వారు గృహాలను నిర్మించుకునేందుకు వీలుగా ఇళ్ల లేఅవుట్ లెవెలింగ్ పనులను యుద్ధ ప్రాతిపదిక పై పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈసందర్భంగా ఇళ్ల నిర్మాణాల …
Read More »టిడ్కో ఇళ్ల లబ్దిదారుల లోన్ ఖాతాలను వెంటనే తెరవండి… : కలెక్టరు జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో టిడ్కో క్రింద నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల లోన్ ఖాతాలను త్వరితగతిన ప్రారంభించేందుకు బ్యాంకర్లు పూర్తి సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బ్యాంకర్లు, మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ తహశీల్దార్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో లోన్ ఖాతాలు తెరవడం, బ్యాంకురుణం మంజూరు తదితర అంశాలపై కలెక్టరు జె. నివాస్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో టిడ్కో క్రింద 26 వేల 894 ఇళ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. …
Read More »ప్రకృతి వ్యవసాయం వైపు మరలండి : రైతులకు జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజ్ఞప్తి
రెడ్డిగుడెం, నేటి పత్రిక ప్రజావార్త : సేంద్రియ వ్యవసాయంతో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ రైతులకు సూచించారు. రైతు చైతన్య యాత్రలలో భాగంగా స్థానిక వ్యవసాయ పరపతి సంఘము కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో లాభాలను తెలుసుకుని ప్రతీ రైతు తమ పంటల సాగును ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పంటలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందన్నారు. …
Read More »మరో సింగ్ నగర్ నిర్మించుకుందాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 59వ డివిజన్ లో గృహ నిర్మాణ లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కరీమున్నీసా, డివిజన్ కార్పొరేటర్ షాహినా సుల్తానా తో కలిసి ఆయన పాల్గొన్నారు. నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పేదలకు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు …
Read More »’ది గాడ్స్ వే’ ఆర్గనైజేషన్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా విపత్కర సమయంలో పేదలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 59వ డివిజన్ సింగ్ నగర్ లోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో బుధవారం ’ది గాడ్స్ వే’ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కొంతమంది పాస్టర్లకు నిత్యావసరాల సరుకుల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా తో కలిసి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది …
Read More »నగర పరిశుభ్రతకు సహకరించండి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిశుభ్రతకు గృహ యజమానులందరూ సహకరించాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 36 వ డివిజన్ సీతన్నపేటలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థ పదార్ధాలను వేర్వేరుగా సేకరించవలసిన ఆవశ్యకతపై గృహ యజమానులకు శాసనసభ్యులు వివరించారు. ఈ అవగాహనను శానిటేషన్ సిబ్బంది …
Read More »దత్తత డివిజన్ పై గద్దె శీతకన్ను : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈ 15 వ డివిజన్ ని దత్తత తీసుకున్నాను అని ఆర్భాటంగా ప్రకటించిన అప్పటి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డివిజన్ అభివృద్ధి కి చేసింది శున్యం అని, అందుకే ప్రజలు ఎక్కడ తిరగబడితారో అనే భయంతో మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శలు చేశారు. బుధవారం 15 వ డివిజన్ రామలింగేశ్వర నగర్ …
Read More »మూడో వేవ్ ప్రచారం నేపథ్యంలో కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు-మాస్కు ధరిద్ధాం వైరస్ ను ఎదుర్కొందాం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తోంది. మే 15 నుంచి జూన్ 20 వరకు దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా ఆంక్షలు సడలిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే కేసుల సంఖ్య మన రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నా… దేశంలోని కేరళ, మహారాష్ట్రసహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో మూడో వేవ్ …
Read More »
Prajavartha Online Telugu News